బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం మరో రెండు వారాలలో ముగియనుంది. ప్రస్తుతం హౌజ్‌లో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. సోమవారం ఎపిసోడ్‌లో ముందు రోజు జరిగిన విషయాలపై ముచ్చటించుకున్నారు. మానస్, కాజల్.. సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ జోక్ చేశారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్ వస్తుందంటూ కామెంట్లు చేశారు. కానీ దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. నువ్వు నేను పడుకున్నప్పుడు ఒకలా, లేచినప్పుడు ఒకలా ఉంటావు. అయిన నా దగ్గర ఉండకు అని చిరాకుగా చెప్పాడు షణ్ముఖ్. దీంతో సిరి ఏడ్చేసింది. అనంతరం అతనికి సారీ చెప్పింది. సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని షణ్ను అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్ నీ దగ్గరకే వస్తుందంటూ సిరిని హెచ్చరించాడు.
అనంతరం బిగ్‌బాస్ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరు పలు అభిప్రాయాలు చెప్పుకున్నాక చివరకు సన్నీ 1, షణ్ను 2, కాజల్ 3, శ్రీరామ్ 4, మానస్ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్ శ్రీరామ్ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారని ప్రకటించాడు.
ర్యాంకుల టాస్కులో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానంలో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్. ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. ఈ క్రమంలో షణ్ను-కాజల్ మధ్య మరోసారి ఫైట్ నడిచింది. దీంతో కాజల్ చాలా యాటిట్యూడ్ చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉంటుంది అని సిరి చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేది తేలిపోనుంది!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…