Shanmukh : బిగ్ బాస్ షోతో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్‌లో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. ఆయన యూట్యూబర్‌గా ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ మొదలయ్యే ముందు ఈయన నటించిన సూర్య వెబ్ సిరీస్ సంచలనం రేపింది. దానికి ముందు సాఫ్ట్‌వేర్ డెవలవ్‌పర్ కూడా రచ్చ చేసింది. ఈ రెండింటికి మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి. వీటితో షణ్ముఖ్ రేంజ్ మారిపోయింది.
బిగ్ బాస్ షోకి వచ్చాక షణ్ముఖ్ క్రేజ్ మరింత పెరిగింది. టైటిల్ ఫేవరెట్ కంటెండర్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరీ ముఖ్యంగా టాస్కుల్లో వందకు వంద శాతం మానసికంగా, శారీరకంగా శ్రమిస్తున్నాడు.
టాప్ 2లో అతడు తప్పక ఉంటాడని జోస్యాలు చెబుతున్నారు. అయితే వెండితెరపై రచ్చ చేయాలనేది షణ్ముఖ్ కల. బిగ్ బాస్ 5 తెలుగులో రప్ఫాడిస్తున్న ఈ కుర్రాడికి ఇప్పుడు హీరోగా ఆఫర్ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని అవకాశాలు వచ్చినా కూడా చిన్న పాత్రలు కావడంతో నో చెప్పాడు. యూ ట్యూబ్‌లో తనను తాను నిరూపించుకున్న తర్వాతే సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేయాలనుకున్నాడు. ఇప్పుడు షణ్ముఖ్ హీరోగా పలువురు నిర్మాతలు సినిమాలు చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి యూట్యూబ్‌లో అదరగొట్టిన షణ్ముఖ్.. వెండితెరపై ఎలా అదరగొడతాడో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…