టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో ఒకరిగా ఉన్న నాగ చైతన్య , సమంత 2017లో వివాహం చేసుకొని నాలుగేళ్ల తర్వాత ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేశావే’ సినిమాలో కలిసి నటించి.. ఆ ప్రేమకథ సినిమాతోనే ప్రేమలో పడిన జంట నాగ చైతన్య, సమంత. ఆ తర్వాత చాలాకాలం ప్రేమలో ఉన్న తర్వాత వివాహం చేసుకున్నారు.. హిందు, క్రైస్తవ పద్ధతిలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు టాలీవుడ్‌లో మోస్ట్ లవ్లీ కపుల్స్‌గా వీళ్లు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా మంచి బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, దీని తర్వాతనే ఎందుకో వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయారు.
విడాకుల తర్వాత సమంత నాగ చైతన్య కు సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు తన దగ్గర ఉండకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసిన దిగిన కొన్ని ఫోటోలను కూడా డిలీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పటి నుండే ఆయనకు సంబంధించిన వస్తువులని ఒక్కొక్కటిగా పంపించింది సమంత. ఈ క్రమంలోనే సమంత పెళ్లి కోసం కట్టుకున్న చీరను కూడా వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న పెళ్లి చీర దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే స్వయానా నాగచైతన్య అమ్మమ్మ చీర కావడం విశేషం. ఆ చీరను కూడా సమంత పంపించేసిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
సమంత… చైతూకి గుర్తుగా పలు టాటూలు వేయించుకుంది. అవి మాత్రం చెరుపుకోలేకపోయింది. మొదటగా తాను చైతుని కలిసిన ‘ఏం మాయ చేశావే’ సినిమాకు గుర్తుగా వీపుపై ‘వైఎంసీ’ అనే టాటూ వేయుంచుకుంది. అంతేకాక ఆమె కుడి చేయి మీద రెండు యారో మార్కులు ఉంటాయి. అదే టాటూ చైకి కూడా ఉంటుంది. దీంతో పాటు సమంత తన రైట్ రిబ్‌పై ‘చై’ అనే టాటూ కూడా వేయించుకుంది.ఇవి అలానే ఉన్నట్టు తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…