Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత క్రేజ్ విడాకుల తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆదరణ, సినిమాల ఆఫర్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. చివరిగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే సినిమా చేసిన సమంత ఈ చిత్రంలో శకుంతలగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ మహిళా ప్రాధాన్యమున్న పాత్రతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియల్‌కు తగ్గ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుండగా, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు హిందీ భాషలోనూ రూపొందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించనున్నారు.
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం థ్రిల్లర్ జానర్‌లో నేషనల్ లెవల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో రూపొందనుందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది.
పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుందని ఆయన అన్నారు. మణిశర్మ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యశోదగా సమంత ఎలా అలరించనుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…