Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిరంజీవి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనపై మీడియాతోపాటు పలువురు ప్రముఖులు ఎన్ని విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మీడియా అప్పట్లో ఎలా ప్రవర్తించిందో తాజాగా వివరించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత యాత్ర చేశానని తెలిపారు.
బస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. ఆ సమయంలో ఫ్యాన్స్ తోపాటు ప్రజలను ఆయన కలవడం జరిగింది. చాలా మందిని ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం చేశాను. ఒక స్టేషన్ లో స్పీచ్ ముగిశాక నెక్స్ట్ స్టేషన్ కి బస్సులో వెళుతున్నాను. నాలుగు మీడియా ఛానల్స్ నన్ను నిరంతరం ఫాలో అవుతున్నాయి. అది నా మీద ప్రేమతో కాదు.. ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతుందా.. హైలెట్ చేయాలనే తపనతో.
నాకు మా బాయ్ ఖర్జూరాలు తినడానికి ఇచ్చాడు. వాటిని తినడం కోసం శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నాను. అది నీట్ గా వీడియో తీసి.. నేను పండ్లు తినడం కోసం చేతులు శుభ్రం చేసుకున్న వీడియో పక్కన పెట్టి.. ఫ్యాన్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వగానే చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నట్లు చక్కగా ఎడిట్ చేశారు.
చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియో పదే పదే చూపిస్తూ.. చిరంజీవికి ఫ్యాన్స్ అంటే అంత అంటరాన్ని వాళ్ళు అయ్యారా ? ప్రజల్ని తాకడమంటే ఆయనకు అంత అసహ్యమా ? ఇలాంటి వ్యాఖ్యలతో నన్ను బద్నామ్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మైక్ పైన శానిటైజర్ స్ప్రే చేద్దామన్నా.. భయం వేస్తుంది అని చిరు ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…