Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమానికి హాజరు కావడమే కాక ఆ ఈవెంట్‌లో సందడి చేశారు. వేదికపై మాట్లాడుతుండగా, పెళ్లెప్పుడు అని అభిమానులు ప్రశ్నించగా, దానికి తేజ్ ఊహించని సమాధానం చెప్పారు. మీరు ఎప్పుడయితే అమ్మాయిలను గౌరవిస్తారో అప్పుడు అని అన్నారు. అది మీవల్ల అవుతుందా?’ అని తేజూ ప్రశ్నించగా, వెంటనే ‘ఊ’ అంటూ అవుతుందని అభిమానులు సమాధానం ఇచ్చారు. ‘అవుతుందా? ఏమవుతుంది?’ అని తేజూ మళ్లీ అడగడంతో ఆడియన్స్ నుంచి ఒకరు ‘పెళ్లి’ అని సమాధానం ఇచ్చారు.
‘పెళ్లవదురా.. ముందు మీరు గౌరవించడం నేర్చుకోండి. పెళ్లెప్పుడో అయిపోయింది. నాలుగుసార్లు అయిపోయింది పెళ్లి’ అంటూ మళ్లీ చమక్కులు విసిరారు తేజూ. ఇంకా ఆడియన్స్ నుంచి ఏవో ప్రశ్నలు వస్తుంటే.. ‘ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌లో ఉన్న వివాదాలు చాలు. దాన్ని మించి వద్దు’ అని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఒక మహిళా అభిమాని సెల్ఫీ అడగగా, సారీ అమ్మా నాకు పెళ్లి అయిపోయిందంటూ నవ్వించారు. సాయిధరమ్ తేజ్ స్పీచ్ మొదలుపెట్టినప్పుడు.. ‘అన్న ఐ లవ్ యు’ అని ఒక అభిమాని అనడంతో.. ‘ఆ పదం నాకు అస్సలు అచ్చిరాలేదండి.. వద్దురా అబ్బాయిలు ప్లీజ్’ అని నవ్వుతూ రిప్లై ఇచ్చారు సాయిధరమ్ తేజ్.

మెగా మేనల్లుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయాడు. అలా తన సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత సినిమాల స్పీడ్ కొంత తగ్గించిన తేజ్ త్వరలో ఓ చిత్రంతో పలకరించనున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తగా ఎదురు చూస్తున్నారు.