Pushpaka Vimanam : దామోదర్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మేఘన జంటగా గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్, ప్రదీప్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పుష్పకవిమానం. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ సినిమాకు విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. దొరసాని సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆనంద్ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఈ క్రమంలోనే తన మూడవ చిత్రంగా తెరకెక్కిన పుష్పకవిమానం నవంబర్ 12వ తేదీన విడుదల కానుండడంతో ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేసింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, సునీల్, కిరీటి వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.