సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాలనుకునే వారి కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. గతంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడేవారు. కానీ ఇప్పుడు ఫ్రెషర్లకు సైతం పలు టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. పలు కంపెనీలు వరుసగా రిక్రూట్‌మెంట్లను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఒరాకిల్, టెక్ మహీంద్రా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించగా.. ఆ జాబితాలో ప్రముఖ టెక్ కంపెనీ యాక్సెంచర్ కూడా చేరింది. తమ కంపెనీలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
యాక్సెంచర్ కంపెనీ అప్లికేషన్ డెవలపర్ పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై సంబంధిత స్కిల్స్ ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అందుకు గాను https://www.accenture.com/in-en/careers/jobdetails?id=ATCI-4279034-S1649736_en&title=Application%20Developer అనే లింక్‌ను సందర్శించవచ్చు. ఇందులో జాబ్‌కు అప్లై చేయడంతోపాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. పెగా ప్లాట్ ఫాం, ఆర్కిటెక్చర్, అప్లికేషన్ డెవలపింగ్‌లలో అనుభవం, టెస్టింగ్, డిబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్, ఎజైల్ డెవలప్ మెంట్ మెథడాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర నైపుణ్యాలను కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదు. కనుక అభ్యర్థులు నైపుణ్యాలను సాధించి కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఇక పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు.