Pushpa Movie : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటించగగా, సమంత స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. శుక్రవారం సాయంత్రం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.
ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన సాంగ్ మాస్‌ను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇందులో సమంత లంగాలో మెరిసిపోయి అందాలు ఆరబోసింది. మొదటిసారిగా బన్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప సినిమాకు ఈ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. కేవలం ఐదు రోజులలో మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా రూ. 1 కోటి 30 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సమంత నటించిన ఈ స్పెషల్ సాంగ్.. తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన వీడొక్కడే సినిమాలోని హనీ.. హనీ.. పాటను పోలి ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే పాటను పుష్ప కోసం కాపీ చేశారా ? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈనెల 12న ‘పుష్ప ప్రీరిలీజ్ పార్టీ’ని హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…