Pulimada OTT Release Date : ఇటీవలి కాలంలో మలయాళం సినిమాలు లేదంటే వెబ్ సిరీస్‌లు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఏ మలయాళీ సినిమా వచ్చిన కూడా వాటికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇటీవల ఓ మలయాళీ చిత్రం థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధిచింది. ఆ చిత్రం పులిమడ. రాజేశ్ దామోదరన్ నిర్మించిన ఈ సినిమాకి, సజన్ దర్శకత్వం వహించాడు. ఇషాన్ దేవ్ బాణీలను సమకూర్చిన ఈ సినిమాకి. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. చిత్రంలో జోజు జార్జ్ కథానాయకుడిగా నటించగా, అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించింది.
ఈ చిత్రం అక్టోబర్ 26వ తేదీన థియేటర్లలోకి రాగా, ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఐదు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ను జరుపుకునేందుకు సిద్ధమైంది. గురువారం (నవంబర్ 23) నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరో మానసిక స్థితి సరిగ్గా లేని తన తల్లి ఆలనా పాలన చూస్తుంటాడు. కొన్ని కారణాల వలన అతని భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోతుంది. ఊహించని ఆ సంఘటన హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అప్పుడు అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.
పులిమడ మూవీలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ప్రేక్షకులని ఎంతగానో కట్టిపడేసాయి. ముఖ్యంగా విన్సెంట్ స్కారియాగా జోజు జార్జ్ నటన సూపర్భ్‌గా అనిపించింది. అతడు ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అటు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మాహిష్మతిగా నటించి ప్రతి ఒక్కరిని అలరించింది. పులిమడలోని ఈ లీడ్ క్యారెక్టర్లు సినిమా అంతా ఎంతో ఆసక్తి రేపేలా ఉండడంతో మూవీని చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…