దాదాపు 14 భాషలలో 20వేలకి పైగా పాటలు పాడి ఎంతో మందిని తన పాటతో అలరించిన వాణీ జయరాం ఇటీవల అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన ఇంట్లోనే చనిపోయిన వాణి జయరాం ముఖంపై గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో తమిళనాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారు. దివంగత గాయని ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన మీదట ప్రమాదవశాత్తు చనిపోయినట్లు అంచనాకు వచ్చారు పోలీసులు. బెడ్ రూమ్‌లోని గ్లాస్ టేబుల్‌పై పడిపోవడంతోనే తలకు బలమైన గాయమైందని, ఇంట్లో ఎవరూ లేనందున ఆమెకు ట్రీట్మెంట్ అందక చనిపోయిందని నిర్ధారించారు.
ఎవరో వాణి జయరాం ఆస్తి కోసం తనని హత్య చేశారు అన్న వార్తలలు పోలీసుల క్లారిటీతో చెక్ పడినట్టు అయింది. కాగా వాణి జయరాం చనిపోయే కొన్ని గంటల ముందు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని పనిమనిషి చెప్పారు . దానికి కారణం కూడా ఆమె కింద పడిపోయి స్పృహ లేకుండా ఉండడమే అంటూ పోలీసుల క్లారిటీ ఇచ్చారు . ఈ క్రమంలోని వాణి జయరాం అభిమానులు మరోసారి ఆమెను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. కాగా, వాణి 4 ఫిబ్రవరి 1968న జయరాంను వివాహం చేసుకున్నారు. మళ్లీ సరిగ్గా అదే రోజున ఆమె కన్నుమూశారు.
నాలుగేళ్ల క్రితం భర్త జయరాం మృతి చెందినప్పటి నుంచి వాణి జయరాం చెన్నై, హడోవ్స్ రోడ్‌లోని తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నారు. ఒక పని మనిషి మాత్రమే ఆమె ఇంటికి వెళ్లి అన్ని పనులను చూసుకుంటోంది. ఎప్పటిలాగే శనివారం ఉదయం 11 గంటలకు వాణీ జయరాం ఇంటికి వెళ్లిన పనిమనిషి ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన లేకపోవడంతో ఈ విషయాన్ని ఆమె వెంటనే వాణీ జయరాం సోదరి ఉమకు తెలియజేయడంతో వారు డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరిచి చూస్తే అప్పటికే మరణించిన ఆమె నుదిటిపై గాయం కనిపించింది. ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి వాణీ జయరాం మృతి చెంది ఉన్నారని వైద్యులు చెప్పారు.