జబర్దస్త్ ఫేం కిరాక్ ఆర్పీ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ కర్రీ పాయింట్‌ని రీఓపెన్ చేసిన విషయం తెలిసిందే.. గత ఏడాది చివర్లో కూకట్‌పల్లిలో ఈ కర్రీ పాయింట్‌ని కిరాక్ ఆర్పీ స్టార్ట్ చేశాడు. నెల్లూరు నుంచి ప్రత్యేకంగా చేపల్ని తెప్పించి.. ఆ జిల్లా ప్లేవర్‌తో చేపల పులుసుని తయారు చేయించగా, అది కూకట్‌పల్లి వాసులకి ఎంతో నచ్చింది. దీంతో రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ కర్రీ పాయింట్ ఫేమస్ అయిపోయింది. మీడియా నుంచి కూడా అతనికి పబ్లిసిటీ లభించడంతో నెల వ్యవధిలోనే రూ. లక్షల్లో బిజినెస్ జరుగుతూ వచ్చింది.
క్రౌడ్ ఎక్కువ పెరిగిపోవడంతో కొద్ది రోజుల పాటు మూసేసాడు. కిచెన్ కెపాసిటీని పెంచడంతో పాటు చేపల పులుసు బాగా వండే మహిళలను నెల్లూరు నుంచి కూకట్‌పల్లికి తీసుకొచ్చి వారితో వండిస్తున్నాడు. అయితే ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ కర్రీ బాగోలేదంటూ కొందరు పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో కిర్రాక్ ఆర్పీ స్పందిస్తూ తన చేపల పులుసు విషయంలో కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు. నేను నా కిచెన్ ను చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నానని నాతో మాట్లాడిన వాళ్లంతా చేపల పులుసు రుచి బాగుందని చెప్పారని ఆర్పీ అన్నారు.
అయితే ఓర్వలేనితనం వల్ల కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని నేను వేర్వేరు రకాల చేపల పులుసును అందిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వంటకాల డెలివరీ జరుగుతుండటంతో కర్రీ పాయింట్ ముందు జనం తగ్గారని ఆయన అన్నారు. జబర్దస్త్ తో మంచి పేరు, ఫేమ్ తెచ్చుకున్న నటుడు కిరాక్ ఆర్పీ. ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఇటీవల నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు అనే కర్రీ పాయింట్ ని గ్రాండ్ గా లాంచ్ చేశాడు.