వినోదం

Naga Chaitanya : నాన్న‌, మామ‌ను ఒకే ద‌గ్గ‌ర‌కు చేర్చిన నాగ‌చైత‌న్య‌..!

Naga Chaitanya : యువ సామ్రాట్ నాగచైతన్య హిట్, ఫ్లాప్స్‌తో తేడా లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. క‌స్ట‌డీతో ఫ్లాప్ కొట్టిన చైతూ రీసెంట్‌గా దూత వెబ్ సిరీస్‌తో ప‌ల‌క‌రించాడు. ఈ వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. అంతేకాదు చైతూ న‌ట‌న‌పై కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇదిలా ఉంటే నాగ చైత‌న్య హీరోగా నటించనున్న ‘తండేల్’ మూవీపై చాలా ఆసక్తి ఉంది. ఈ చిత్రంలో మత్య్సకారుడిగా ఆయన నటించనున్నారు. ఫస్ట లుక్‍తోనే ఈ చిత్రానికి ఫుల్ హైప్ వచ్చింది. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‍ పాత్ర పోషించనున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూ – సాయి పల్లవి రెండోసారి కలిసి నటిస్తున్నారు.

మొత్తంగా తండేల్ మూవీపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. కాగా, ఈ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ లో ఉదయం 10.30 గంటలకు ముహూర్తం షాట్ చిత్రీకరించారు.. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా వ‌చ్చి సంద‌డి చేశారు. నాగార్జున‌, వెంక‌టేష్ తో క‌లిసి నాగ చైత‌న్యని ఒకే ఫ్రేములో చూడ‌డం అంద‌రికి ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఇకిదిలా ఉంటే ‘తండేల్’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Naga Chaitanya

‘తండేల్’ అంటే ఓ తెగకు నాయకుడు అని అర్థం. మత్స్యకారుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం టైటిల్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.ఇటీవ‌ల దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తండేల్ అంటే గుజరాతీలో బోట్ ఆపరేటర్ అని అర్థం అని తెలిపాడు. గుజరాత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లో తండేల్ అనే పదాన్ని వాడుతారట. నాగ చైతన్యకు ఇది 23వ మూవీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. 2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్‍కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. వారు పాకిస్థాన్‍లోని జైలులో ఉండగా.. విడిపించేందుకు భారత ప్రభుత్వం కృషి చేసింది. పాక్‍తో చర్చలు జరిపింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పాకిస్థాన్ ఆ జాలర్లను విడుదల చేసింది.ఆ క‌థ‌తో తండేల్ రూపొందుతుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM