Muthu Rerelease Date : సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ వస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది. కొన్నాళ్లుగా సినిమా పరిశ్రమలో 4K రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుండగా, అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను హీరోల పుట్టిన రోజులకు, సినిమా యానివర్సరీలకు అభిమానులు రీ రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ సినిమాను మళ్లీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘ముత్తు’ చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డిసెంబర్ 12 రజనీకాంత్ బర్త్ డే కాగా, ఆ రోజు వస్తుందంటే తమిళనాడులో పండగ వాతావరణం వస్తుంది. ప్రతిసారి సూపర్ స్టార్ బర్త్ డేను స్పెషల్ గా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఈసారి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. సింగిల్ డబుల్ కాదు ఏకంగా ట్రిపుల్ బొనంజా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 2న రజిని ఆల్ టైం క్లాసిక్ ముత్తు రీ రిలీజ్ కాబోతుంది. దాంతో పాటు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ శివాజీ సినిమాను కూడా మరోసారి విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను రజినికాంత్ బర్త్ డే వీక్ లోనే రీ రిలీజ్ చేయబోతుండగా, ఈ సినిమాలకి అదిరిపోయే రెస్పాన్స్ రానుందని అంటున్నారు. గతంలో రజనీ పుట్టిన రోజుకు బాబా రీ రిలీజ్ చేస్తే దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ముత్తు చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా … మీనా ఈ మూవీ లో రజనీ కి జోడిగా నటించింది. శరత్ బాబు , రఘువరన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా 1995 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి పెద్ద హిట్ అయింది. సూపర్ కలెక్షన్ లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇకపోతే ఈ సినిమాలో రజిని … మీనా మధ్య కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తమిళనాడులోని అనేక థియేటర్లలో 175 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యంలో ముచ్చెత్తింది . ముత్తు చిత్రం 1998లో జపనీస్ భాషలో విడుదలై సంచలనం సృష్టించింది.