Bigg Boss Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుండగా, తమిళంలో కూడా ఏడో సీజన్ నడుస్తుంది. ఇక హిందీ విషయానికి వస్తే 17వ సీజన్ నడుస్తుంది. దీనికి హోస్టుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా ఉన్నారు. దీనికోసం ఆయన భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుండగా, ఈ సీజన్‌లో రచ్చ మాములుగా లేదు. అయితే హిందీ షోలో మాత్రం కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది. రీసెంట్‌గా ఓ కంటెస్టెంట్ లేడి కంటెస్టెంట్‌కి ముద్దులు పెట్టి హాట్ టాపిక్‌గా నిలిచాడు.
మరోవైపు ఈ షోలోకి జంటగా వచ్చిన ట అంకితా లోఖండే, విక్కీ జైన్ బాగానే సందడి చేస్తున్నారు. వీరి మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ ఎక్కువగా ప్రయత్నం చేశాడు. అప్పుడే గొడవ పడడం.. ఆ వెంటనే కలిసిపోవడం చేస్తున్న వీరు ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అందిస్తున్నారు. అయితే అంకిత లోఖండే తాజాగా తనకి ప్రెగ్నేన్సీ టెస్ట్ నిర్వహించారని… తనకు నెలసరి కూడా రావడం లేదని భర్తకి చెబుతూ అందరికి షాక్ ఇచ్చింది. తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కూడా తెలియజేసింది. ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని విక్కీ జైన్ , అంకితపై ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

ఒకవేళ అంకిత ప్రగ్నెన్సీ అని తెలితే ఆమె హౌజ్ నుండి బయటకు వెళుతుందా, లేదంటే ఆమెతో పాటు ఆమెభర్తని కూడా పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయితే కనుక బిగ్ బాస్ హౌస్ లో మొదటి సారిగా తల్లితండ్రులు అయిన ఘనత వీరికే దక్కుతుంది. బిగ్ బాస్ చరిత్రలో వరుణ్ సందేశ్-రితిక షేర్‌లను బిగ్ బాస్ హౌస్‌లోకి భార్యభర్తలుగా వెళ్లారు.. తరువాత రోహిత్-మారియా జంటను హౌస్‌లోకి తీసుకురావడం జరిగింది. ఈ రెండు జంటలు ప్రేక్షలుకి మంచి వినోదం పంచాయి. ఇక అంకిత విషయానికి వస్తే ఆమె కొన్నాళ్లు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమాయణం నడిపింది. ఆయన నుండి విడిపోయాక విక్కీ జైన్‌ని వివాహం చేసుకుంది.