Manchu Manoj : మంచు ఫ్యామిలీలో అనేక గొడవలు ఉన్నాయని ఈ మధ్య కాలంలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. తరువాత అంతా సద్దుమణిగింది. అయితే తాజాగా అదే సంఘటనపై మంచు మనోజ్ స్పందించారు. సోదరా అనే మూవీకి సంబంధించి తొలి పాటను మనోజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ గతంలో తమ అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ గురించి వివరించే ప్రయత్నం చేశారు.
అన్నదమ్ముల మధ్య అహాలు, అనవసరమైన గొడవలు ఉండకూడదని మంచు మనోజ్ అన్నారు. సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. బ్రదర్స్ అనే రిలేషన్‍షిప్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య ఈగోలు, అనసరమైన విషయాలు వస్తాయో.. బంధం ముందుకు వెళ్లదు. బ్రదర్స్ మధ్య ఎప్పుడు ఈగోలు ఉండకూడదు. సమస్యలు ఉండకూడదు.. అని మనోజ్ అన్నారు.

అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తే ఎవరో ఒకరు ఒక్కరు తగ్గి అయినా పరిష్కరించుకోవాలని మంచు మనోజ్ చెప్పారు. ఒకరు తగ్గైనా.. బ్రదర్స్‌తో, సిస్టర్స్‌తో, ఫ్యామిలీతో ఉంటే అది ఎప్పుడైనా బాగా ఉంటుంది అని మనోజ్ చెప్పారు. బ్రదర్స్, హ్యూమన్ ఎమోషన్స్ మీద సోదరా సినిమాను తీస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని మనోజ్ అన్నారు. మొత్తంగా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినా కొనసాగించకుండా పరిష్కరించుకుని కుటుంబంలా కలిసి ఉండాలని మనోజ్ చెప్పారు. గొడవలు ఉంటే ఎవరో ఒకరు తగ్గాలని సూచించారు.
ఇక సోదరా సినిమాలో సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాకు చెందిన తొలి పాటను మనోజ్ లాంచ్ చేశారు. కాగా 2018 తర్వాత మంచు మనోజ్ సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే చిత్రం చేస్తున్నారు. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఓ షోకు కూడా హోస్ట్‌గా మనోజ్ వ్యవహరించనున్నారు.