Pushpa 2 OTT : ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలలో పుష్ప 2 మూవీ ఒకటి. రెండేళ్ల కిందట వచ్చిన పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం దక్కించుకోగా, సెకండ్ పార్ట్ అంతకు మించిన విజయం సాధిస్తుందని అంటున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అవి అంతకంతకూ పెరుగుతన్నాయే తప్ప తగ్గట్లేదు. ఈ అంచనాలను అందుకోవడానికి సుకుమార్ అండ్ టీం మామూలుగా కష్టపడట్లేదన్నది చిత్ర వర్గాల సమాచారం.ఆల్రెడీ సిద్ధంగా ఉన్న స్క్రిప్టుకు మెరుగులు దిద్దుకుని.. ఇంకా పెద్ద స్థాయికి సినిమాను తీసుకెళ్లడం కోసం తన టీంతో సుకుమార్ చాలానే కసరత్తు చేశాడు.
ప్రస్తుతం చిన్న చిన్న సీన్లు తీయడానికి కూడా వారాలకు వారాలు సమయం పడుతోందట. భారీ సెట్టింగ్స్ వేసి.. వందలు వేలమందితో షూట్ చేస్తున్నారు. ముందుగా వీళ్లందరితో రిహార్సల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత షూటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా గంగ జాతర సీక్వెన్స్ అయితే ఒక రేంజ్‌లో తీస్తున్నారట. దీని కోసమే 40-50 కోట్ల దాకా ఖర్చు వచ్చేలా ఉందని కొందరు చెప్పుకొస్తున్నారు. షూట్ మొదలయ్యే సమయానికి రూ.200 కోట్లతో సినిమా తీయాలన్నది ప్లాన్ కానీ ఇప్పటికే అంచనా బడ్జెట్ 50 శాతం పెరిగిపోయిందట. సినిమా పూర్తయ్యేసరికి ఇంకా బడ్జెట్ పెరిగిపోయే అవకాశాలు లేకపోలేదని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి.

వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా ఓటీటీ ఒప్పందం గురించి సమాచారం బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ మైత్రీ మూవీ మేకర్స్‌తో డీల్ కుదుర్చున్నట్టు సమాచారం. ‘పుష్ప 1: ది రైజ్’ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకోగా, ఇప్పుడు పుష్ప2 కోసం భారీ డిమాండ్ చేయడంతో అమెజాన్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. సుమారు రూ.100కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ డీల్ జరిగినట్టు టాక్. పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు వచ్చిందట.