Malavika Mohanan : మాళవిక మోహనన్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ అమ్మడు వైవిధ్యమైన సినిమాలతో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ మంచి జోరుమీదుంది. మాళవిక మోహనన్ ఎక్కువగా అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందాల వడ్డింపులో రోజు రోజుకు డోస్ రెట్టింపు చేస్తుంది. తాజాగా అందాల ముద్దుగుమ్మ వయ్యారాలన్నీ ఒలకబోస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తూ వారి గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫోటో షూట్ పిక్స్ షేర్ చేస్తూ .. నెటిజన్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం మాళవిక గ్లామర్ షోకి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. తెలుగులో ఈ భామ ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. బోల్డ్ పిక్స్‌తో ఎప్పుడు పరిచయం అయిపోయింది.
మాళవిక మోహనన్ అప్పుడప్పుడూ స్టార్ హీరోలతో నటించినా కూడా రేసులోకి మాత్రం ఎప్పుడూ రాలేదు. మాస్టర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు మాళవిక. తొలి సినిమానే ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరోతో నటిస్తుంది ఈ బ్యూటీ. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో మాళవిక మోహనన్ ఓ హీరోయిన్. ఈమెతో పాటు మరో ఇద్దరు బ్యూటీస్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం మాళవికే.

ఈ సినిమాతో తనకు తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతుంది మాళవిక. తమిళంలో విజయ్ లాంటి హీరోతో నటించిన తర్వాత కూడా ఈమెకు పెద్దగా ఫోకస్ అయితే రాలేదు. దాంతో గ్లామర్ షోకు తెర తీసింది ఈ బ్యూటీ. మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో పుట్టించే ప్రకంపనలు ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఏకంగా గూగుల్ తల్లికి కూడా చెమటలు పట్టించేలా రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. కచ్చితంగా ఈ అందాల ఆరబోత చూసిన తర్వాత దర్శకుల నుంచి పిలుపు వస్తుందని ఆశ పడుతుంది మాళవిక మోహనన్.