Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన ఓ వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ బాబు సర్జరీ చేయించుకోనున్నట్టు వార్తలు రాగా, అది నిజమని తెలుస్తుంది. స్పెయిన్‌లో మహేష్ బాబు మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబుకి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
కోలుకున్నాక ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొననున్నాడు. దుబాయ్‌లో మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మహేష్ బాబు మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందన్న విషయం తెలిసిన అభిమానులు ఆయన ఆరోగ్యంపై కొంత ఆందోళన చెందారు. దాదాపు రెండు నెలల పాటు మహేశ్‌బాబు షూటింగ్‌కి దూరంగా ఉండనున్న నేపథ్యంలో సర్కారు వారి పాట రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి.
మహేశ్‌బాబు గతంలో కూడా మోకాలి నొప్పితో గాయంతో బాధపడ్డారు. 2014 నుంచి ఆయన ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే ఆ సమయంలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగ్‌కి వెళ్లారు. అప్పుడు సర్జరీ చేయించుకోకపోవడం వల్లే ఆ బాధ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు నొప్పి మరింత ఎక్కువ కావడంతో తప్పని సరి పరిస్థితులలో సర్జరీ చేయించుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…