ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం కొంత టైం కేటాయిస్తుంటారు. వారికి అవసరమైన సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో ఏ మాత్రం తగ్గరు. ఇప్పటికే తన ఫ్యామిలీకి విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిన మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేసి వార్తలలోకి ఎక్కారు.
నగరంలోనే రెసిడెన్షియల్ ఏరియాలకు సంబంధించి అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో ఇటీవల మహేశ్‌బాబు ప్లాటును కొన్నారు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ వెబ్‌సైట్ మనీ కంట్రోల్ కథనం ప్రచురించింది. మహేష్ బాబు రూ.26 కోట్లు పెట్టి ప్లాటుని కొనుగోలు చేశారని.. స్థలం రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ వివరాలతో సహా ఒక ప్రముఖ బిజినెస్ ఆన్ లైన్ పత్రిక తెలియజేసింది. 2021 నవంబరు 17న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగినట్లు తెలిపింది.
యర్రం విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌బాబు 1442 గజాల ప్లాటును 26 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. స్టాంప్‌డ్యూటీ కింద రూ.1.43 కోట్లు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించినట్లు పేర్కొంది. అయితే ఈ ఇంటి స్థలం కొనుగోలు విషయంపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకూ మహేష్ బాబు స్పందించలేదు. ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…