Rajinikanth : కండక్టర్ నుండి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ఎంతో మందికి ఆదర్శం. ఆయన నటుడిగా కన్నా కూడా మంచి మనిషిగా ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించిన రజనీకాంత్ ఎంతో మందికి ఆదర్శం. ఆయన 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తలైవాకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రజనీకాంత్ సినిమాల ద్వారానే బాగానే సంపాదించారు. రూ.కోట్లలో పారితోషికం తీసుకుంటూ దివంగత నటుడు ఎంజీఆర్‌కు తర్వాత స్థానంలో ఉన్నారు రజనీ. కక్నా లెడ్జ్ 2021 నివేదిక ప్రకారం.. రజనీ నికర ఆస్తుల విలువ రూ.360 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఆయన సినిమాల ద్వారా సంపాదించారు. కమర్షియల్ యాడ్స్ చేస్తే ఇంకెన్ని కోట్లు సంపాదించే వారో అని అందరూ ముచ్చటించుకుంటున్నారు.
సినిమా ప్లాప్ అయి నష్టాలొస్తే తీసుకున్న పారితోషికం కూడా నిర్మాతకు తిరిగి ఇచ్చేసే అంత గొప్ప హృదయం ఆయన సొంతం. ఇక విలాసవతంమైన జీవితానికి సూపర్ స్టార్ ఎప్పుడూ దూరమే. చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. అయితే రజనీ ఇల్లు మాత్రం చాలా లగ్జరీయస్ గా ఉంటుంది. ఇల్లు బాగుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్మే వ్యక్తి. ఇక వాహనాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. టయోటా ఇన్నోవా.. రేంజ్ రోవర్.. బెంట్లీ కార్లు ఉన్నాయి. రూ.100-120 కోట్ల పెట్టుబడులను పెట్టారు. వివిధ వ్యాపారాల్లో ఈ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…