వినోదం

Guppedantha Manasu October 31st Episode : ఫారెన్ వెళ్ళిపోతావా అని కొడుకుతో దేవయాని డిస్కషన్.. ఫణింద్ర క్లాస్.. తల్లీ కొడుకులను వణికించిన ధరణి..!

Guppedantha Manasu October 31st Episode : రిషి వసుధారని కాపాడి తీసుకువస్తుంది అనుపమ. మహేంద్ర థాంక్స్ చెప్పి ఎవరో తెలియనట్లు, ఉండిపోతాడు. అయితే, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుండి వెళ్లిపోవడమే మంచిది అని అంటుంది అనుపమ. సరే అంటారు వీళ్ళ ముగ్గురు. వెళ్లొస్తామని అనుపమకి చెప్పేసి, ముగ్గురు హైదరాబాద్ కి వచ్చేస్తారు. ఎందుకు ఇలా అవుతోంది. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అని రిషి అంటాడు. ప్రమాదాలు తలపెట్టే వాళ్ళు, చుట్టూ ఉన్నారు కనుక ఇలానే జరుగుతుందని వసుధార అంటుంది. రెండుసార్లు అనుపమ గారు కాపాడారు. కాబట్టే సరిపోయింది.

లేదంటే, పరిస్థితి ఎలా ఉండేదో అని రిషి అంటాడు. అసలు ఆమె ఎవరు అని వసుధారా అడుగుతుంది. డాడీకి తనకి మధ్య, ఏదైనా గతం ఉందేమో అనిపిస్తుంది అని రిషి అంటాడు. కచ్చితంగా ఉందని అనుకుంటున్నాను అని వసుధారా అంటుంది. అరకులో ఉన్నప్పుడు, మావయ్యని వెతుకుతూ వెళ్ళినప్పుడు, ఒక రాయి మీద మావయ్య, అత్తయ్య పేర్లతో పాటు అనుపమ పేరు కూడా ఉంది అని వసుధార అంటుంది. తర్వాత అనుపమ గారు, మావయ్యని రిసార్ట్ దగ్గర కారులో డ్రాప్ చేయడం, చూశాను అని వసుధార చెప్తుంది.

నిజం సార్ అని అంటుంది. నాకు తెలిసి మావయ్య లో వచ్చిన మార్పులకు, కారణం కూడా ఆవిడే అనుకుంటున్నాను అని వసుధారా అంటుంది. ఇంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు. అరకులో ప్రశాంతంగా ఉండాలని వెళ్తే, అక్కడ కూడా ప్రమాదాలు ఎదురయ్యాయి. కొత్త వ్యక్తుల పరిచయం కూడా. అస్సలు వెళ్లకపోయినా బాగుండేది అనిపించింది అంటాడు మహేంద్ర. మరీ అంతలా నిరుత్సాహ పడుతున్నారు. అయినా కొత్త వ్యక్తులు అంటున్నారు ఎవరు డాడ్..? మీకు మనల్ని కాపాడిన ఆమె గురించి అని మాట్లాడుతుండగా, వసుధారా రిషి ని ఆపుతుంది.

మనల్ని అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలని మహేంద్ర అంటే, దీని గురించి నేను స్పెషల్ ఆఫీసర్ తో కలిసి మాట్లాడతాను. వాడు దొరికే వరకు నేను విశ్రాంతి తీసుకోను అని అంటాడు రిషి. వాడికి తగిన శిక్ష పడినప్పుడే, జగతి ఆత్మ శాంతిస్తుందని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత అక్కడినుండి వెళ్ళిపోతుండగా, మీరు మారిపోయినట్టేనా అని అడిగితే, మాక్సిమం డ్రింక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తానని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత అనుపమ గురించి మాట్లాడుకుంటారు రిషిదార.

Guppedantha Manasu October 31st Episode

శైలేంద్ర ఇంట్లో టెన్షన్ గా తిరుగుతూ ఉంటే, దేవయాని వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావని అడిగితే, ఎండి సిట్ దక్కించుకోవడమే లక్ష్యం అని అంటాడు. సాధ్యం కాదేమో అనిపిస్తుంది. వాళ్ళు ప్రశాంతంగా అరకు వెళ్లారు వచ్చారు. మళ్లీ పనుల్లో పడిపోయారు. నువ్వు ఏమి చేయలేవు. తిరిగి ఫారెన్ వెళ్ళిపోతావా అని అడుగుతుంది దేవయాని. అలా మాట్లాడితే, వెంటనే ఫైర్ అవుతాడు శైలేంద్ర. జగతి ప్రాణం పోయిన తర్వాత కూడా, కల నెరవేరలేదు. ఇంత చేసినా ఫలితం మన చేతికి రావడం లేదని దేవయాని అంటుంది.

వచ్చేవరకు ఓపిక పట్టాలని, శైలేంద్ర రివర్స్ అవుతాడు. ఒక ప్రాణం పోయినా, మనకి దక్కింది ఏమీ లేదు. మిగిలిన ప్రాణాలు కూడా పోతే కానీ అని దేవయాని మాట్లాడుతుంటే, అక్కడికి ఫణీంద్ర వస్తాడు. అసలు ఏం జరుగుతోంది.. ? మీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. మీ అమ్మ నోటి నుండి ఆ మాట ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. ఎవరు గురించి మాట్లాడుతున్నారు చెప్పండి అని రెట్టిస్తాడు ఫణింద్ర. ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో నేను చెప్తాను మావయ్య గారు అని ధరణి అంటుంది. చిన్న అత్తయ్య ప్రాణాలు పోయాయి కదా.. ఆమెని ఎవరు చంపారో వాళ్ళు దొరక బట్టి, తగిన శిక్ష వేయాలని మాట్లాడుకుంటున్నారేమో.

ధరణి చెప్పేది నిజమేనా..? నేను రాకముందు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా.. ఇప్పుడేం మాట్లాడలేదు అని అంటాడు ఫణింద్ర. జగతిని తలుచుకుని బాధపడుతున్నామని, దేవయాని అంటుంది. నటించకు ఏ రోజైనా ఆప్యాయంగా మాట్లాడావా..? తను ఉన్నప్పుడు దూరం పెట్టావు. ఇప్పుడేమో తలుచుకుంటున్నావు. నువ్వు జగతిని తలుచుకుంటే, జగతి ఆత్మ కూడా శాంతించదు అని ఫణింద్ర అంటాడు. ధరణి నాకు ఒక సహాయం చేయి. తల్లి కొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చేయమ్మా. నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని అంటాడు.

సరే మావయ్య గారు మీకోసం నా ప్రయత్నం చేస్తాను అని ధరణి అంటుంది. మిమ్మల్ని చూస్తుంటేనే, చిరాగ్గా ఉందని చెప్పి వెళ్ళిపోతాడు ఫణింద్ర. ధరణిపై కోపంగా చెయ్యి ఎత్తగానే, మావయ్య గారు అని ధరణి అరుస్తుంది. ఇప్పుడు కొట్టండి చూద్దాం అనేసి, మీలా ఖాళీగా లేను. నాకు పని ఉందని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఏదో ప్లాన్ చెప్తుంది దేవయాని. నీ ప్లాన్ ప్రకారం, నువ్వు చెయ్యి. నేను చేయాల్సిందే నేను చేస్తానని శైలేంద్ర చెప్తాడు. అనుపమ గురించి ఎంక్వయిరీ చేస్తున్న విషయం తెలియకూడదు మావయ్య గారికి అని చెప్తుంది వసుధార.

ఏం చేస్తున్నావ్ వసుధార అని రిషి అంటాడు. వీటిని బట్టలు అంటారు. దీన్ని మడత పెట్టడం అని అంటారు అని సెటైర్ వేస్తుంది. నేను కూడా మడత పెడతానని అంటాడు. వసుధార ఒప్పుకోదు. నువ్వు ఎండి సీట్ లో కూర్చున్నావు. నీ పనులు నేను చేస్తే తప్పేంటి అని అంటాడు. నేను మిమ్మల్ని ఎవరెస్ట్ గా చూస్తాను. సింహంలా చూస్తాను మిమ్మల్ని. సింహం ఎక్కడైనా చీరలు మడత పెడుతుందా అంటుంది. ఓ భార్యకి, భర్త సహాయం చేస్తారంటూ వసు చేతిలో ఉన్న చీరలు లాక్కుని ప్రయత్నిస్తాడు. కాసేపు సరదాగా పరిగెడుతూ ఉంటారు. ఇది చూసి మహేంద్ర మురిసిపోతాడు.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM