వినోదం

Guppedantha Manasu October 24th Episode : అనుప‌మ ఎంట్రీ.. మ‌హేంద్ర ట్ర‌యాంగిల్ ప్రేమ కథ..? వసుధారకు వచ్చిన డౌట్.. అనుపమ సమాధానం ఏమిటి..?

Guppedantha Manasu October 24th Episode : రిషి, వసుధారా నిద్రలో ఉండగా, ఉదయమే హోటల్ రూమ్ నుండి బయటకు వెళ్లిపోతాడు మహేంద్ర. రూమ్ లో కనపడకపోవడంతో, కంగారు పడతారు. మహేంద్ర కోసం అరకు మొత్తం వెతుకుతూ ఉంటారు. తాగిన మత్తులో ఒక పార్క్ దగ్గర, మహేంద్ర కి జగతి పిలిచినట్లుగా అనిపిస్తుంది. ఆ ప్లేస్ గురించి, అతనికి బాగా తెలిసినట్లు పార్క్ లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు మహేంద్ర. తన పర్సు కింద పడిపోయిన విషయం కూడా గమనించలేక పోతాడు. మత్తులో తూలుతూ, ఒక దగ్గర కూర్చుంటాడు.

అక్కడ చెట్టు కింద ఉన్న బండరాయిపై, జగతి మహేందర్ ల పేరు ఉంటుంది. అక్కడ కూర్చుని. జగతి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జగతి, మహేంద్రాల పేరుతో పాటుగా, ఆ రాయి మీద అనుపమ అనే పేరు కూడా ఉంటుంది. అనుపమ పేరుని మహేంద్ర చదువుతుండగానే అక్కడికి అనుపమ వస్తుంది. కింద పడిపోయిన, మహేంద్ర పర్స్ ని అతనికి ఇస్తుంది. అనుపమను చూడగానే, మహేంద్ర షాక్ అవుతాడు. ఇంత కాలమైనా. నాపై ఉన్న కోపం తగ్గలేదా అని మనసులో అనుకుంటాడు మహేంద్ర.

నీ విషయంలో మామూలుగా ఉండలేకపోతున్నానని, అనుపమ కూడా మనసులోనే ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. అనుపమని చూడగానే, మందు బాటిల్ ని దాచేస్తాడు మహేంద్ర. పడేసుకునే అలవాటు ఇంకా పోలేదా అని అడుగుతుంది. నా తలరాత అని సమాధానం చెప్తాడు మహేంద్ర. ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇంతకాలమైనా నీకు ఈ ప్లేస్ గుర్తుందా అని, అందుకే ఇక్కడికి వచ్చావా అని మహేంద్రతో అంటుంది. నేను రాలేదు నా జ్ఞాపకాలు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చాయి. మర్చిపోయే జ్ఞాపకాలా అవి, ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవడానికి అని మహేంద్ర చెప్తాడు.

Guppedantha Manasu October 24th Episode

జగతిని ఎందుకు తీసుకు రాలేదని, మహేంద్రని అడుగుతుంది. జగతి చనిపోయిన విషయం తెలిస్తే, ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడిపోతాడు. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. సమాధానం చెప్పకపోవడంతో, అనుపమ సీరియస్ అవుతుంది. జగతి ఎందుకు రాలేదని అంటుంది. నీ భార్య కంటే ముందు, జగతి నాకు ప్రాణ స్నేహితురాలు అని కోపంగా అంటుంది. జగతి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనిది, ఆమెకి ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అంటుంది. మీ ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా, నేను పరిష్కరిస్తానని, ఆమె ఎక్కడ ఉందో చెప్పమని కోపగించుకుంటుంది.

ప్రాణంగా ప్రేమించి, ఇప్పుడు ఎందుకు దూరంగా పెడుతున్నావు అని నిలదీస్తుంది. మహేంద్ర మాత్రం సమాధానం చెప్పకుండా, మౌనంగా ఉండిపోతాడు. నా మనసు బాలేదు తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అంటాడు. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. అప్పుడు జగతి గురించి తప్పకుండా చెప్పాలి అని మహేంద్రతో చెప్పి, అక్కడి నుండి అనుపమ వెళ్ళిపోతుంది. అక్కడికి వసుధార రిషి వస్తారు. మహేంద్ర ని చూసి కంగారు పడతారు. బండరాయి మీద పేరు చూసి, వసుధార అనుపమ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది.

మహేంద్ర తో మాట్లాడిన విషయాలను, అనుపమ గుర్తు చేసుకుంటుంది. పెద్దమ్మ ఆమెకి అప్పుడే కాల్ చేస్తుంది. అనుపమ డల్ గా ఉండడంతో ఏమైందని అడుగుతుంది. మహేంద్ర కనిపించిన విషయం పెద్దమ్మకి చెప్తుంది. పెద్దమ్మ మహేంద్ర పేరు వినగానే షాక్ అవుతుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత మహేంద్ర నిన్ను కలిశాడంటే, నాకు ఆశ్చర్యంగా ఉందని అంటుంది. అతని పక్కన జగతి లేదా అని అడిగితే లేదని అనుపమ అంటుంది. నువ్వు మహేంద్ర తో సరిగ్గా మాట్లాడకపోవడం వల్లనే, ఇలా ఒంటరిగా మిగిలిపోయావని అనుపమతో పెద్దమ్మ అంటుంది. నాకు జగతి అంటే ప్రాణం అని, ఏం జరిగినా తట్టుకోలేనని అనుపమ అంటుంది. మహేంద్ర అంటే అని పెద్దమ్మ అనుపమని అడుగుతుంది. అనుపమ సమాధానం ఏంటనేది, రేపటి ఎపిసోడ్ లో చూడాలి ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోయింది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM