Amla : ఉసిరికాయలు.. వీటిని చూడగానే చాలా మందికి నోరూరుతుంది. చాలా మంది ఉసిరికాయలను తింటుంటారు. ఇవి మనకు ప్రకృతి అందించిన వరమనే చెప్పవచ్చు. వీటిని చూడగానే తినాలనిపించేలా నోరూరిస్తుంటాయి. ఇక ఉసిరికాయలను తిన్న వెంటనే నీళ్లను తాగితే తియ్యగా ఉంటుంది. దీని వల్ల చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చిన్నారులు వీటిని ఆసక్తిగా తింటుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉసిరికాయల వాడకం ఎక్కువే. ఉసిరి చేయని మేలు అంటూ ఉండదని అందరూ అంటుంటారు. అంతలా ఉసిరి ప్రసిద్ధి గాంచింది.
ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరికాయలకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉసిరికాయ అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. ఉసిరికాయలతో చేసే పచ్చడి అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని వేడిగా అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అదిరిపోతుంది. ఇలా ఉసిరికాయలను చాలా మంది ఆస్వాదిస్తుంటారు. అయితే ఉసిరికాయలను తినడం వరకు బాగానే ఉంది. కానీ వీటిని ఒక్క ఆదివారం మాత్రం తినకూడదట. అలా అని పండితులు చెబుతున్నారు. పెద్దలు కూడా ఇదే విషయాన్ని మనకు సూచిస్తుంటారు. అలాగే రాత్రి సమయాల్లోనూ ఉసిరిని తీసుకోకూడదని, ఆ పేరును కూడా ఉచ్చరించకూడదని అంటుంటారు. అయితే ఇందుకు గల కారణాలు ఏమిటో చాలా మందికి తెలియవు. అవే ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా రాత్రి సమయాల్లో ఉసిరి చెట్లపై పాములు ఉంటాయట. ఆ సమయంలో ఉసిరికాయల గురించి మాట్లాడితే అప్పుడు ఆ చెట్లపై ఉండే పాములను ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుందట. ఇది ఏమాత్రం మంచిది కాదు. కనుకనే రాత్రి పూట ఉసిరికాయల గురించి మాట్లాడుకోరు. ఇక రాత్రి పూట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చలువ చేసే ఆహారాలను తినకూడదు. ఉసిరి మనకు మిక్కిలి చలువ చేస్తుంది. కనుక దాన్ని మధ్యాహ్నమే తినాలి. రాత్రి తినకూడదు. తింటే శ్లేష్మం ఎక్కువై శ్వాస కోశ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఉసిరికాయలను రాత్రిపూట తినకూడదు.
అలాగే ఉసిరి కాయలను ఆదివారం కూడా తినకూడదు. ఉసిరి ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. శుక్ర గ్రహానికి చెందినది. సూర్య గ్రహానికి, శుక్ర గ్రహానికి పడదు. కనుక శుక్రుడికి ఇష్టమైన ఉసిరికాయలను సూర్య గ్రహం రోజైన ఆదివారం తినకూడదు. ఇలా ఉసిరికాయలను తినడంలో నియమాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే గ్రహపీడల బారిన పడాల్సి వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…