Guppedantha Manasu November 13th Episode : శైలేంద్ర, దేవయాని.. రిషి, వసుధార విష్ కాలేజీకి వెళ్లిన విషయం కనిపెట్టలేకపోతారు. వారిద్దరు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవడానికి రిషికి ఫోన్ చేస్తాడు శైలేంద్ర. కానీ ఆ ఫోన్ వసుధార తీసుకుంటుంది. మేము ఏం చేస్తున్నాం.. ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నాం.. అని నిఘాపెట్టి సమాచారం లాగడమే తప్ప అంతకుమించి మీరు ఏం చేయలేరని శైలేంద్ర, దేవయానికి వసుధార సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక నుంచి మీ ఆటలు సాగవు. మీ కౌంట్‌డౌన్ స్టార్టయ్యింది. త్వరలోనే మీ పతనం మొదలవుతుందని దేవయానిని మాటలతో బెదిరిస్తుంది వసుధార.
నువ్వు మమ్మల్ని ఏం చేయలేవని వసుధారతో అంటుంది దేవయాని. ఏం చేయలేనని మీరు అనుకుంటున్నారు. నేను మౌనంగా ఉన్నంత మాత్రాన అది చేతకానితనం కాదని వసుధార బదులిస్తుంది. ఫణీంద్ర బాధపడకుండా ఈ ఇష్యూను డీల్ చేయాలని చూస్తున్నానని అంటుంది. నేను తల్చుకుంటే మిమ్మల్ని నిల్చొన్న చోటే కప్పిపెట్టేయగలను అంటూ శైలేంద్ర, దేవయానికి మాస్ వార్నింగ్ ఇస్తుంది.
వసుధారకు అంటూ ఓ పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారమే వెళ్తున్నానని జాగ్రత్త అంటూ బెదిరిస్తుంది. ఫోన్లు చూసి కూపీలు లాగడం, ఇన్ఫ్మర్మేషన్ తెలుసుకోవడం లాంటి పిల్ల చేష్టలు మానుకోమని మీ కొడుక్కి చెప్పండి అంటూ శైలేంద్రకు గట్టి పంచ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తుంది. వసుధార వార్నింగ్‌తో శైలేంద్ర, దేవయాని బెదిరిపోతారు. వసుధారతో మాట్లాడాలని శైలేంద్ర అనుకుంటాడు. కానీ అతడి మాటలు వినకుండా ఫోన్ కట్ చేస్తుంది వసుధార.
తర్వాత రోజు రిషి, వసుధార కాలేజీకి వెళ్తారు. వసుధారకు శైలేంద్ర ఎదురుపడతాడు. అతడిని చూడగానే ముఖం చిట్లించుకుంటుంది వసుధార. అసలు నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు, నిన్న చాలా పొగరుగా మాట్లాడావు అంటూ వసుధారపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. నా పొగరు నా ఇష్టం. అది ఎప్పటికీ తగ్గదు. మీరు అన్నా, అనకపోయినా నేను పొగరునే. పొగరు అన్నది ఈ వసుధార సిగ్నేచర్ అంటూ మళ్లీ శైలేంద్రకు దిమ్మతిరిగే రిప్లై ఇస్తుంది. నా పొగరు, ఆటిట్యూడ్‌కు క్యాలికులేషన్స్ ఉంటాయి. ఎవరి దగ్గర ఎంతలా ఉండాలో అంతలోనే ఉంటాయని చెబుతుంది.
పిన్ని చనిపోయిన తర్వాత కూడా నా ముందు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావని వసుధారను బెదిరించేందుకు ప్రయత్నిస్తాడు శైలేంద్ర. భయంతోపాటు ధైర్యం కూడా ఉంది.. ఆ ధైర్యం పేరు రిషి అంటూ శైలేంద్రకు దీటుగా బదులిస్తుంది వసుధార. మీకు కాలేజీలో ఏం పని లేదు కదా, ఇక్కడ ఎందుకు కాపు కాశారు అంటూ శైలేంద్రను అడుగుతుంది వసుధార. ఈ రోజు అటెండర్ ఆఫ్ కదా అతడి ప్లేస్‌ను భర్తీ చేయడానికి వచ్చారా అంటూ శైలేంద్రను అవమానిస్తుంది వసుధార. ఆమె మాటలతో శైలేంద్ర హర్ట్ అవుతాడు. రెచ్చిపోయి రంకలెస్తోన్న ఓ పశువుకు బుద్దిచెప్పడానికి ముందుడుగు వేస్తున్నా అంటూ శైలేంద్రను మరింత రెచ్చగొడుతుంది వసుధార. నన్ను పశువు అంటావా మాటలు జాగ్రత్తగా రానీయ్ అంటూ వసుధారకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. అప్పుడే అక్కడికి రిషి వస్తాడు.
వసుధారకు శైలేంద్ర వార్నింగ్ ఇవ్వడం చూసి ఏమైందని అడుగుతాడు. శైలేంద్ర తడబడిపోతాడు. మీరు ఎప్పుడు అనే మాట ఈ రోజు శైలేంద్ర అన్నాడు అంటూ రిషికి బదులిస్తుంది వసుధార. నీకు బాగా పొగరు అని శైలేంద్ర తనను అన్నాడని రిషితో అంటుంది వసుధార. ఆ మాట ఎప్పుడూ నన్ను రిషి అంటుంటారని శైలేంద్రకు చెబుతున్నానని రిషికి జరిగిన సీన్‌ను వేరేలా వివరిస్తుంది వసుధార. ఆ ఒక్క ముక్క చెప్పడానికి శైలేంద్ర తటపటాయిస్తున్నాడని శైలేంద్రను ఇరికిస్తుంది. అది నిజమని నమ్మిన రిషి ఇంత చిన్న మాటకు అంత మాట అన్నావేంటని శైలేంద్రపై కోపగించుకుంటాడు.
వసుధార మాటలతో దారుణంగా అవమానించడంతో శైలేంద్ర లోలోన కోపంగా రగిలిపోతాడు. అయినా కూడా అవన్నీ పక్కనపెట్టి ముకుల్ ఎంక్వైరీ గురించి రిషిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ డీటెయిల్స్ శైలేంద్రకు రిషి చెప్పకుండా అడ్డుకుంటుంది వసుధార. ముకుల్‌ను కలుస్తాడు రిషి. జగతిని చంపిన షూటర్ మర్డర్‌కు ముందు ఓ వ్యక్తి అతడిని కలిశాడని రిషితో చెబుతాడు. అతడు ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నామని చెబుతాడు. వాడికి సంబంధించిన ఎలాంటి అధారాలు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నాడని ముకుల్ అంటాడు. అతడిని ఎలాగైనా కనిపెట్టాలని ముకుల్‌ను రిక్వెస్ట్ చేస్తాడు రిషి. ఆ నేరస్థుడిని తండ్రి ముందు నిలబెట్టి పనిష్‌మెంట్ ఇవ్వాలని ముకుల్‌తో అంటాడు రిషి. కచ్చితంగా వాడిని పట్టుకొని తీరుతానని రిషితో చెబుతాడు ముకుల్.
మహేంద్రకు అనుపమ ఫోన్ చేస్తుంది. అనుకోకుండా ఆ ఫోన్‌కాల్ రిషి లిఫ్ట్ చేస్తాడు. అనుపమ ఫోన్ చేసి తన పేరు చెబుతుంది. అరకులో కలిసిన అనుపమ తండ్రికి ఫోన్ చేయడం చూసి రిషిలో అనుమానం మొదలవుతుంది. ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నామని, ఆ గెట్ టూ గెదర్ మీటింగ్‌కు మహేంద్రను ఇన్వైట్ చేస్తే రావడం లేదని, అందుకే తాను ఫోన్ చేశానని చెబుతుంది అనుపమ. మా డాడ్ మీకు ఎలా తెలుసు అంటు అనుపమను అడుగుతాడు రిషి. నేను చెప్పిన ప్లేస్‌కు వస్తే నీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది అని అంటుంది. మీ డాడ్‌తో పాటు జగతిని కూడా తీసుకొని రావాలని అంటుంది. తల్లి చనిపోయిన విషయం అనుపమకు చెప్పాలని రిషి అనుకుంటాడు. కానీ అనుపమ వినకుండా ఫోన్ కట్ చేస్తుంది.
మహేంద్ర, అనుపమ గురించి తెలియని ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మహేంద్రను గెట్ టూ గెదర్ వేడుకకు తీసుకువెళ్లాలని రిషి ఫిక్స్ అవుతాడు. జగతి చనిపోయిన విషయం అనుపమకు మహేంద్ర చెప్పకుండా దాచడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని రిషి అనుకుంటాడు. మహేంద్రకు చెప్పకుండా ఆ వేడుకకు తీసుకెళ్లాలని అనుకుంటాడు. గె టూ గెదర్ పార్టీ కోసం మహేంద్రను టిప్ టాప్‌గా రెడీ చేస్తాడు రిషి. తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పమని రిషిని అడుగుతాడు మహేంద్ర. రిషి మాత్రం సమాధానం ఇవ్వకుండా అతడిని గెట్ టూ గెదర్ పార్టీకి తీసుకొస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…