Indian 3 Movie : ఇటీవలి కాలంలో ఒక సినిమా హిట్ అయితే దానికి అనుబంధంగా రెండు మూడు పార్ట్‌లు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే తొలి పార్ట్ హిట్ అయినంత సీక్వెల్స్ విజయాలు చవిచూడడం లేదు. ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడం.. రెట్టింపు ఆదాయం తెచ్చింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’తొలి పార్ట్ మంచి విజయం సాధించడంతో దాని కథకి అనుబంధంగా రెండో భాగం చేస్తున్నారు.అలానే ఇండియన్న చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 కూడా రూపొందుతుంది. ప్రస్తుతం దక్షిణాదిన తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ కూడా అంతటితో ఆగిపోదట. దానికి కూడా మూడో భాగం ఉంటుందట. ఈ విషయం ‘ఇండియన్-2’లో నిర్మాణ భాగస్వామి అయిన ఉదయనిధి స్టాలిన్ స్వయంగా వెల్లడించాడు. ‘ఇండియన్-3’ ఉంటుందని ఇంతకుముందే ప్రచారం జరిగింది. కానీ దానిపై క్లారిటీ లేదు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉదయనిధి ఇండియన్-2’ ఫుటేజ్ చాలా ఎక్కువగా వచ్చిందని.. దీని కథ విస్తృతి ఎక్కువ అని.. కాబట్టి ‘ఇండియన్-3’ కూడా వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాకు కమల్ హాసన్ కొత్తగా 40 రోజుల డేట్లు ఇచ్చాడని.. షూటింగ్ జరుగుతోందని.. శంకర్, కమల్ ఇద్దరూ కూడా ఔట్‌పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఈ సినిమాకు మూడో భాగం చేసే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అతను చెప్పుకొచ్చాడు. ఇక ఇండియన్-2 వచ్చే ఏప్రిల్లో రిలీజవుతుందని ఉదయనిధి స్పష్టం చేశాడు. ఇండియన్-2కు ఒక చోట బ్రేక్ ఇచ్చి.. ఇందులో మిగిలిన కంటెంట్‌కు మరికొంత జోడించి ఇండియన్-3ని సెట్ చేయాలన్నది శంకర్ ఆలోచనగా తెలుస్తుంది.
అనుకున్న దాని కన్నా కూడా మరో 40 రోజులు ఎక్కువ పని చేస్తే ఇండియన్ 2, ఇండియన్ 3 కూడా పూర్తి అవుతాయని ,ఈ మేరకు లైకా సంస్థతో చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. ఇదే నిజమైతే ఇండియన్-3ని కూడా వచ్చే ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలని కూడా శంకర్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ .. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు. ఇండియన్ 2, ఇండియన్ 3 చిత్రాలకి ఎప్పుడు గుమ్మడికాయ కొడతాడు అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…