నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఇప్పటికే రూ.80 కోట్ల వసూళ్లను సాధించి టాప్ మూవీగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం.
అఖండ మూవీకి బాలయ్య నటన ఒక ప్లస్ పాయింట్ అయితే థమన్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఇందులో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇక ఈ మూవీలో అనేక పాత్రలు ఆకట్టుకున్నప్పటికీ ఇందులో నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో బేబీ దేష్ట చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె నటనను అందరూ మెచ్చుకుంటున్నారు.
దేష్టను బాలకృష్ణ ముద్దు చేస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ బాలయ్య.. బేబీ దేష్ట గురించి చెప్పారు. ఆమె నటన పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
దేష్ట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిర్మాతలకు కనెక్ట్ అయిందని, తరువాత బోయపాటికి పరిచయం అయిందని దేష్ట తల్లిదండ్రులు తెలిపారు. ఆమెకు డైలాగ్స్ పలకడం సరిగ్గా రాకపోయినా బోయపాటి తమ పాపతో అద్భుతంగా నటింపజేయించారని తెలిపారు. మొదటి సినిమాతోనే తమ కుమార్తెకు మంచి పేరు రావడం సంతోషంగా ఉందన్నారు. బాలకృష్ణ దేష్టతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, తమను ఆయన బాగా చూసుకున్నారని తెలిపారు.
బోయపాటి తమ పాపకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను అందరూ చూసి తమ పాప నటన ఎలా ఉందో చెప్పాలని వారు కోరారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…