వినోదం

Chandra Mohan : ఎలాంటి అల‌వాట్లు లేవు.. అయినా రూ.100 కోట్లు పోగొట్టుకున్న చంద్ర‌మోహ‌న్..

Chandra Mohan : ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ 80 ఏళ్ల వ‌య‌స్సులో తుదిశ్వాస విడిచారు. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న నేడు అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసారు. ఆరంభంలోనే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన కొత్త నిర్మాత‌ల‌కి అలానే హీరోయిన్స్ కి ల‌క్కీ హ్యాండ్‌గా మారాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 సంవత్సరం, మే 23వ తేదీన ఆయన జన్మించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1996లో వచ్చిన ‘రంగుల రాట్నం’ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు చంద్ర‌మోహన్.

దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే తనదైన విలక్షణ నటనతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన చంద్ర‌మోహ‌న్ గుండెపోటు కారణంగా మ‌ర‌ణించార‌ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.ఆయ‌న మృతికి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల‌తో పాటు సినీ అభిమానులు సంతాపం తెలియ‌జేశారు. చంద్ర‌మోహ‌న్ సుమారు 930కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. అందులో హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారానే ఆయన ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. ఆ క్ర‌మంలో ఎన్నో అవార్డులు కూడా ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చేరాయి.

Chandra Mohan

చంద్ర‌మోహ‌న్ త‌న కెరీర్‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌ల‌తో పాటు ఆస్తులు కూడా బాగానే కూడ‌బెట్టుకున్నాడు. చంద్రమోహన్‌కు హైదరాబాద్‌తో పాటు చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు స‌మాచారం. చెన్నై నగరంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అప్పుడు చాలా తక్కువ మొత్తం రేటుకే దాన్ని తీసుకున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు వరకూ ఉంటుందని టాక్.చంద్రమోహన్‌కు ప్రస్తుతం రూ. 350 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. అందులో ఇద్దరు కూతుళ్లకు సమానంగా కొంత భాగాన్ని పంచేశారట. అయితే చంద్ర‌మోహ‌న్ కి ఒక‌ప్పుడు కొంపల్లికి సమీపంలో ఒక ద్రాక్ష తోట కొనుక్కోమ‌ని గొల్ల‌పూడి మారుతిరావు చెప్పార‌ట‌. దాంతో 35 ఎక‌రాలు కొన్న ఆయ‌న మెయింటైన్ చేయ‌లేక అమ్మాడ‌ట‌. ఇక మ‌ద్రాసులో 15 ఎక‌రాలు అమ్మేశాడ‌ట‌. ఆ భూముల విలువ రూ.30 కోట్లు ఉంటుంద . శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కు దగ్గర్లో 6 ఎకరాల పొలం కొన‌గా అది కూడా అమ్మేశార‌ట‌. అజాగ్రతత్తతో దాదాపు రూ.100 కోట్ల వరకు త‌నకు న‌ష్టం వ‌చ్చింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు చంద్ర‌మోహ‌న్.

Share
Sunny

Recent Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM