వినోదం

Boys Hostel OTT : ఓటీటీలో సంద‌డి చేస్తున్న ర‌ష్మీ గౌత‌మ్ బాయ్స్ హాస్టల్.. థియేట‌ర్‌లో మిస్ అయిన వారు చూసేయండి..!

Boys Hostel OTT : ఒక‌ప్పుడు న‌టిగా అల‌రించిన ర‌ష్మీ గౌత‌మ్ ఇప్పుడు యాంక‌రింగ్‌తో స‌త్తా చాటుతుంది. జ‌బ‌ర్ధ‌స్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీల‌తో పాటు ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కి యాంక‌రింగ్ చేస్తూ అద‌ర‌గొడుతుంది. అయితే ర‌ష్మీ అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా సంద‌డి చేస్తుంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో నటించిన చిత్రం బాయ్స్ హాస్ట‌ల్. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి చిన్న సినిమాగా వచ్చి ట్రెండ్ సెట్టర్‍గా నిలిచిన హాస్టల్ హుదుగురు బేకగిద్దారే తెలుగులో బాయ్స్ హాస్ట‌ల్ పేరుతో విడుద‌లైంది. ఒరిజనల్‌ వెర్షన్‌లో రిష‌బ్ శెట్టి, ర‌మ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, యాంకర్‌ రష్మీ గౌతమ్ పోషించారు. క‌న్న‌డలో మాదిరిగానే తెలుగులోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ మూవీ మంచి క‌లెక్ష‌న్స్‌నే రాబ‌ట్టింది. థియేట‌ర్స్‌లో తెగ ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఎదురు చూస్తుండ‌గా, తాజాగా తెలుగు వ‌ర్షెన్ ఓటీటీలో సంద‌డి చేస్తుంది. ఒరిజినల్‌ వెర్షన్‌ ఇప్పటికే ఓటీటీలో రాగా తెలుగు వెర్షన్‌ మాత్రం ఈటీవీ విన్‌లో శుక్రవారం (నవంబర్‌ 10) నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా మొత్తం హాస్టల్‌లోని వార్డెన్‌ శవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హాస్టల్‌లో ఉండే ఓ కుర్రాడు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఈ మేరకు తను రాసుకున్న ఓ షార్ట్‌ఫిలిం స్టోరీని తన ఫ్రెండ్స్‌కు చెబుతుంటాడు. అయితే ఆ కుర్రాడు చెప్పిన షార్ట్‌ఫిల్మ్‌లో మాదిరిగానే నిజంగానే వారి హాస్టల్ వార్డెన్ చ‌నిపోతాడు.

Boys Hostel OTT

అప్పుడు అతని వద్ద ఒక సూసైడ్‌ లెటర్ ల‌భ్య‌మ‌వుతుంది. ఇక అందులో ఆ కుర్రాడితో పాటు స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి. దాంతో వార్డెన్‌ శవాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్‌ బాయ్స్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ స‌మ‌యంలో వారికి ఎదురైన అనుభవాలేంటి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు చిత్ర ద‌ర్శ‌కుడు. ఇలాంటి క్రైమ్‌ చుట్టూ కామెడీని పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌ చేయడంలో దర్శకుడు నితిన్‌ కృష్ణమూర్తి వంద మార్కులు కొట్టేయ‌డంతో సినిమాకి నూటికి నూరు శాతం మార్కులు ప‌డ్డాయి. చిత్రం మాత్రం అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM