Kannur Squad OTT Release Date : మలయాళ చిత్రాలు ఇటీవల మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఆ చిత్రాలని మలయాళ ప్రేక్షకులే కాక ఇతర భాషలకి సంబంధించిన ప్రేక్షకులు సైతం ఆదరిస్తున్నారు. ఇక మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇటీవలి కాలంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఆయనన హీరోగా వచ్చిన తాజా చిత్రం కన్నూర్ స్క్వాడ్. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్, శబరీష్ వర్మ, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదలై పెద్ద విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర అవలీలగా వంద కోట్ల వసూళ్లని రాబట్టింది.
ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ హిట్ మూవీ మొదట నవంబర్ 10 నుంచి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గురువారం (నవంబర్ 9) హాట్‌స్టార్ అఫీషియల్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ చిత్రం రియలిస్టిక్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీని తెరకెక్కించాడు. కన్నూర్ స్వ్కాడ్ పేరుతో నిజంగానే కేరళలో ఓ స్పెషల్ పోలీస్ టీమ్ ఉండేది, ఆ టీమ్ సాల్వ్ చేసిన క్రైమ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు డైరెక్టర్ తెలియజేశాడు.
కన్నూర్ స్క్వాడ్ ఓ సినిమాలా కాకుండా పోలీసులు ఇన్వేస్టిగేషన్‌ను నిజంగానే చేస్తున్నట్టుగా కళ్లముందు సాక్షాత్కరింపజేశాడు. క్రైమ్ అంశాలతో పాటు వృత్తికి, వ్యక్తిగత బాధ్యతలకు మధ్య పోలీసులకు ఎదుర్కొనే సంఘర్షణను ఈ సినిమాలో చూపించారు.ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరిస్తుంది. ఇక మమ్ముట్టి ఇప్పుడు యాత్ర 2 అనే తెలుగు చిత్రం కూడా చేస్తున్నారు. యాత్ర మంచి విజయం సాధించడంతో యాత్ర2లో కూడా నటించేందుకు ఆసక్తి చూపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…