David Warner Pushpa : డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌తో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. మరోవైపు సోషల్ మీడియాలో తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కరోనా వేళ క్రికెట్ ఆడలేకపోయిన వార్నర్ తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలతో భలేగా ఫేమస్ అయిపోయాడు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో క్యాండీ వార్నర్‌తో కలిసి ‘బుట్టబొమ్మ’.. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’లో మైండ్ బ్లాక్ పాటలతోపాటు పలు సాంగ్స్‌కి డ్యాన్స్‌లు చేసి ఫేమస్ అయ్యాడు.
రీసెంట్‌గా పునీత్ రాజ్ కుమార్‌కి సంబంధించి కూడా ఓ వీడియో చేసి కన్నడిగుల అభిమానం చూరగొన్నాడు. తాజాగా బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ సినిమాలో ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..’ సాంగ్‌లో ఫేస్ మార్ఫ్ చేసి ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎంతలా వైరల్ అవుతుందంటే ఆ వీడియోను ఏకంగా 2 మిలియన్ల మంది వీక్షించారు.
వార్నర్ వీడియోపై విరాట్ కోహ్లీ .. ‘నువ్వు ఓకే నా!’ అని కామెంట్ చేయగా.. ‘కాస్త గొంతు పట్టేసినట్టుంది..’ అని వార్నర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనిని చూసిన అల్లుఅర్జున్ ‘‘ మై బ్రదర్ వార్నర్.. తగ్గేదేలే’’ అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఇక ఇదిలా ఉండగా వార్నర్ ప్రస్తుతం యాసెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆడుతున్నాడు. తొలి టెస్టులో చెలరేగి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రెండో టెస్ట్‌కి సిద్ధం అవుతున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…