Comedian Raghu : బాగా బ్రతికిన వాళ్లు ఒక్కోసారి పొట్టకూటి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవల్సి ఉంటుంది. టాలీవుడ్ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రఘు తాజాగా లిక్కర్ వైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. సినిమాల్లో విలన్, కమెడియన్ పాత్రల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రఘు. జబర్దస్త్ షోలోనూ కనిపించాడు. మధ్యలో అలీతో జాలీగా అనే షోలోనూ రచ్చ చేశాడు. అయితే రఘుకి ఇప్పుడు ఆఫర్స్ తక్కువే వస్తున్నాయి.
ఈ క్రమంలో ఆయన మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మద్యం దుకాణాల కేటాయింపునకు ఇటీవల నిర్వహించిన లక్కీడ్రాలో ఆయన రెండు వైన్ షాపులను సొంతం చేసుకున్నారు. నల్లగొండ పట్టణ శివారు చర్లపల్లి వద్ద మర్రిగూడ బైపాస్‌లో తనకు దక్కిన షాప్‌లో రఘు.. స్వయంగా మద్యం సీసాలను సర్దారు. పూజలు చేశారు. కౌంటర్ వద్ద ఉండి మద్యాన్ని విక్రయించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
లాక్‌డౌన్ వల్ల ఏం చేయాలో అర్థం కాక.. ఇంటి చుట్టూ కూరగాయలు పెట్టాడట. ఆర్గానిక్‌గా పండించాడట. చాలా మంచిగా పండాయట. ఇదేదో బాగుందని పది ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ ఇప్పుడు పండిస్తున్నాడట. ఇంతలోనే తన ఫ్రెండ్స్ వైన్ షాపులకు టెండర్ పడుతుందట వేద్దామని అన్నారు. సరే ఇందులో కూడా మన లక్ ఎలా ఉందో అని ట్రై చేశాం. నాలుగింటికి వేస్తే రెండు దుకాణాలు నాకే వచ్చాయి అంటూ రఘు చెప్పుకొచ్చాడు. మొత్తానికి రఘుకు సినిమాల పరంగా ఆఫర్స్ రాకపోయినా.. ఈ విధంగా అదృష్టం కలసి వస్తోందన్నమాట.
ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ టెక్ మహీంద్రా పలు విభాగాల్లో ఆసక్తి, అర్హత ఉన్న…
CSIR నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఉఏన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో పలు విభాగాల్లో పనిచేయడానికి గాను ఆసక్తి, అర్హత…
మీరు రైల్వేలో ఖాళీల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. ఎందుకంటే బీహార్‌లోని పాట్నాలో ఉన్న…