వినోదం

Chiranjeevi : సినిమాల్లో టీచ‌ర్లుగా మెప్పించిన యాక్ట‌ర్లు వీరే..!

Chiranjeevi : కొన్ని సినిమాలు స‌మాజంలో ఉన్న వాస్త‌వ స్థితి గ‌తుల‌ను ప్ర‌తిబింబించేలా ఉంటాయి. ఇక స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన వృత్తుల్లో ఒక‌టైన ఉపాధ్యాయ వృత్తిపైనా అనేక సినిమాలు వ‌చ్చాయి. అందులోనూ తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఉపాధ్యాయులుగా న‌టించి ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను చూర‌గొన్నారు. త‌మ విద్యార్థుల‌ను వారు ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దే స‌న్నివేశాల‌తో ఆయా న‌టులు ప్రేక్ష‌కుల‌ను అల‌రించి, నిజంగా ఉపాధ్యాయులంటే అలాగే ఉండాల‌ని చాటి చెప్పారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఉపాధ్యాయుడి క‌థాంశంతో వ‌చ్చిన ప‌లు ముఖ్య‌మైన సినిమాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

విశ్వ‌విఖ్యాత నట సార్వ‌భౌమ, స్వ‌ర్గీయ ఎన్‌టీఆర్ ఉపాధ్యాయుడి పాత్ర‌లో 1972లో విడుద‌లైన చిత్రం బడి పంతులు. ఇందులో ఎన్‌టీఆర్ నిజాయితీ క‌లిగిన ఒక స‌గ‌టు స్కూల్ టీచ‌ర్‌గా క‌నిపించి అల‌రించారు. త‌న సొంత పిల్ల‌లే త‌మ‌ను ఇంటి నుంచి వెళ్ల‌గొడితే త‌న వ‌ద్ద విద్యన‌భ్య‌సించిన ఓ విద్యార్థి ప్ర‌యోజ‌కుడై, పోలీస్ అధికారి రూపంలో తిరిగి వ‌చ్చి త‌నకు చిన్న‌ప్పుడు చ‌దువు చెప్పిన ఆ మాష్టారుకు ఇల్లు కొనిస్తాడు. ఈ మూవీలో ఉపాధ్యాయుడు, విద్యార్థుల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని చ‌క్క‌గా చూపించారు. ఉపాధ్యాయుడి పాత్ర‌లో ఎన్టీఆర్ అద‌ర‌హో అనిపించేలా న‌టించారు.

Chiranjeevi

కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సుంద‌ర‌కాండ మూవీలో వెంక‌టేష్ ఉపాధ్యాయుడి పాత్ర‌లో క‌నిపించి అల‌రించాడు. ఓ విద్యార్థిని త‌న‌ను ప్రేమిస్తే గురు శిష్యుల మ‌ధ్య అలాంటి సంబంధం ఉండ‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పిన టీచ‌ర్ పాత్ర‌లో వెంక‌టేష్ అద్భుతంగా న‌టించాడు.

చెడ్డ దారులు ప‌ట్టి, చ‌దువు స‌రిగ్గా చ‌ద‌వ‌కుండా చిల్ల‌ర వేషాలు వేసే విద్యార్థుల‌ను స‌రైన దారిలో పెట్టే లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో చిరంజీవి మాస్ట‌ర్ సినిమాలో అద్భుతంగా న‌టించారు. నిజంగా ఉపాధ్యాయుడు అంటే.. ఇలాగే ఉండాల‌ని ఆయ‌న సినిమా చాటి చెబుతుంది.

పిల్ల జ‌మీందార్ సినిమాలో ఎంఎస్ నారాయ‌ణ క్యారెక్ట‌ర్ కొన్ని సార్లు కామెడీ పండించినా.. ప్ర‌ధాన పాత్రలో న‌టించిన నాని క్యారెక్ట‌ర్‌కు జీవిత‌మంటే ఏంటో తెలిసేలా చేస్తారు. మ‌నిషి జీవించినంత కాలం విలువ‌ల‌తో బ‌త‌కాల‌నే జీవిత పాఠాల‌ను ఎంఎస్ నారాయ‌ణ విద్యార్థుల‌కు బోధిస్తారు. ఆయ‌న లాంటి ఉపాధ్యాయులు నిజ జీవితంలో మ‌న‌కు చాలా అరుదుగా క‌నిపిస్తారు.

న‌టుడిగా రాజేంద్ర ప్ర‌సాద్ గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ క్యారెక్ట‌ర్‌ను అయినా అవ‌లీల‌గా చేసేయ‌గ‌ల ప్ర‌తిభ ఆయ‌న సొంతం. అలాగే ఓన‌మాలు మూవీలోనూ ఆయ‌న రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా అద్భుతంగా న‌టించారు. టీచ‌ర్‌గా రిటైర్ అయి కొడుకుతో అమెరికాలో సెటిల్ అయినా.. సొంత ఊరిని మార్చడం కోసం వృద్ధాప్యంలోనూ తిరిగి త‌న ఊరికి వ‌స్తాడు. త‌న ఊరిని మారుస్తాడు. త‌న ఊరికి ఆయ‌న మ‌ళ్లీ ఉపాధ్యాయుడు అవుతారు. అలా ఆ పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్ అల‌రించారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM