Chandra Mohan Daughter : హీరోగా.. హాస్యనటుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కనిపించి మెప్పించాడు. అయితే కొద్ది రోజులుగా చంద్రబాబు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకు మధుమేహం, అధిక రక్తపోటు ఎక్కువగా బాధిస్తున్న నేపథ్యంలో చంద్రమోహన్ చికిత్స తీసకుంటున్నారు. ఇటీవల చంద్రమోహన్ ఫ్యామిలీ డాక్టర్ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన.. శనివారం ఉదయం అచేతనంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఉదయం 9.57 గంటలకు చంద్రమోహన్ మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలున్నారు. చంద్రమోహన్ 1943, మే 23న.. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. సినిమాల్లోకి వచ్చాక చంద్రమోహన్‌గా మార్చుకున్నారు. ఆయన తల్లిదండ్రులు వీరభద్రశాస్త్రి, శ్యామలమ్మగా ఉన్నాఉ. బీఎన్ రెడ్డి వంటి దిగ్దర్శకుడి దృష్టిలో పడి.. ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తర్వాత తన వద్దకు వచ్చిన అన్ని పాత్రలూ చేయడం మొదలుపెట్టడంతో.. చంద్రమోహన్‌లోని ఆల్‌రౌండర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

చంద్రమోహన్ కి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిరివురు కూడా సినిమాలపై మక్కువ చూపలేదు. వారిద్దరు పిల్లలు చాలా అందంగా ఉంటారని తెలుస్తుండగా, వారిని చైల్డ్ ఆర్టిస్టులుగా చేయమని భానుమతి కూడా అడిగారట. అయితే చంద్రమోహన్ మాత్రం ఆ ప్రతిపాదన తిరస్కరించారు. నటుడుగా బిజీగా ఉన్న రోజుల్లో నాకు పిల్లలతో గడిపే సమయం ఉండేదే కాదని చెప్పి వారిని సినిమాలకి, సినిమా ఫంక్షన్స్‌కి దూరంగా ఉంచారు. అయితే చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురు మాత్రం కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సప్తపది సినిమాలో హీరోయిన్గా నటించారు. చంద్రమోహన్ తమ్ముడు కుమార్తె పేరు సబిత కాగా,ఆమె నటించిన తొలి చిత్రం మంచి విజయం సాధించడం తర్వాత సబితకు అనేక ఆఫర్లు క్యూ కట్టాయి.