Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన 101వ ఎపిసోడ్‌లో షణ్ముఖ్, సన్నీల ఎమోషనల్ జర్నీని చూపించారు. షణ్ముఖ్ జర్నీ గురించి అద్భుతంగా మాట్లాడారు బిగ్ బాస్. అర్ధం చేసుకునే స్నేహితులు ఈ ఇంట్లో దొరికారని.. మీ మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి.. మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారని చెప్పారు.
మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం అని బిగ్ బాస్‌కి తెలుసు.. మీలోని ప్రేమను ఆ గది చూసింది.. ’ అంటూ చెప్పుకొచ్చారు బిగ్ బాస్. మొత్తంగా షణ్ముఖ్ గురించి బిగ్ బాస్ చెప్పిన దాంట్లో మోజ్ రూం ఒకటి కాగా.. మిగిలినది అంతా సిరి కోసమే అన్నట్టుగా ఉంది. మీ మనసుని తాకిన ఫొటో గ్రాఫ్‌ని మీతో కలిసి తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోని తీసుకుని వెళ్లాడు షణ్ముఖ్. అదే ఫొటోలో సిరి కూడా ఉండటంతో అది చూసి తెగ పొంగిపోయింది సిరి.
ఇక సన్నీ వంతు రావడంతో .. ‘సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీ బంధాలు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా అందరి ముఖంపై నవ్వు తీసుకువచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా, లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు.
మీలోని కోపం మీకు ఇబ్బందులను తీసుకుని వచ్చి.. అందరి ముందు దోషిగా నిలబెట్టిన క్షణాలు.. మీ మనసుని గాయం చేసిన విషయాన్ని బిగ్ బాస్ గమనించారు. ప్రతి టాస్క్‌లోనూ గెలవాలనే మీ తపన.. గెలిచేవరకూ పోరాడే పట్టుదల.. మీ ఓర్పు.. మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన విజయమే మీకు గుర్తు చేస్తుంది. ’ అంటూ సన్నీ జర్నీని చూపించారు బిగ్ బాస్.
మీ మనసుకి దగ్గరైన ఒక ఫొటోగ్రాఫ్‌ని మీతో తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో.. తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని కూడా తీసుకున్నాడు. మొత్తంగా ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్‌కి సంబంధించిన జర్నీలలో నలుగురి వీడియోలు ప్రసారం కాగా, సిరి జర్నీ వీడియో నేడు ప్రసారం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…