Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఎప్పుడూ నాగార్జునతో హడావిడి చేసే హౌజ్‌మేట్స్ ఈ సారి పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సందడి చేశారు. శనివారం ఉదయం ‘గుడ్ మార్నింగ్’ అంటూ.. ఇంటి సభ్యులు హౌస్‌లో మాట్లాడిన మాటల్నే పాట రూపంలో రీమిక్స్ చేసి వినిపించారు. ఈ రీమిక్స్ గజ్జీ సాంగ్ అదిరిపోయింది. ఇంటి సభ్యులు తెగ ఎంజాయ్ చేశారు.. చాలా డిఫరెంట్‌గా అనిపించింది.
ఇక ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్‌షిప్ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. ఇక హౌజ్‌మేట్స్ తో డ్యాన్స్‌లు వేయించగా, షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇక హరితేజ బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు.
తర్వాత రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. టాప్ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్‌షిప్‌పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకోవంతో సన్నీ, మానస్, శ్రీరామ్ పడీపడీ నవ్వారు.
అనంతరం నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, రాహుల్ హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్‌మేట్స్ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్‌ప్రైజ్ అయ్యాడు.
వేరే కంటెస్టెంట్ టవల్ వాడారా ? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్ టవల్ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్‌లో శ్రీరామ్ గెలిచాడు. మొత్తానికి తాజా ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…