Attarintiki Daredi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని మరింత రెట్టింపు చేసిన చిత్రాలలో అత్తారింటికి దారేది ఒకటి. విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కేవలం ఒక్క ఫోన్ కాల్ లోనే వినిపించారంటా. స్టోరీ విని పవర్ స్టార్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంట వెంటనే మూవీ సెట్స్ పైకి వెళ్లింది. సినిమాలో అత్త క్యారెక్టర్ మెయిన్ రోల్ కావడంతో ఆ రోల్ లో ఎవరిని ఎంపిక చేశారని త్రివిక్రమ్ పవన్ అడగడంతో… నదియా అని చెప్పగానే కన్విన్స్ అయ్యారట.
మరదలు క్యారెక్టర్ కోసం సమంత స్థానంలో మొదట ఇలియానాను తీసుకోవాలని భావించగా, అప్పటికీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఇలియానా నో చెప్పడంతో… ఆ స్థానంలో సమంతను తీసుకున్నారంట. ఇక ఈ సినిమాలో ఫారెయిన్ లొకేషన్స్ ను సెర్చ్ చేయడానికి మొదటి సారిగా పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్వయంగా స్పెయిన్ వెళ్లారని టాక్.. సుమారు 30 నుంచి 45 రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారంట. అన్ని కుదరడంతో సినిమా మంచి విజయం సాధించింది. 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సినిమాకు 4 అవార్డులు వచ్చాయి.
సినిమాని అంతా ఆద్యంతంగా నడిపించిన త్రివిక్రమ్ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఓ సీన్ లో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే అదే సమయంలో అలీ వచ్చి ఒక సిగరెట్ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు. దాంతో పవన్ కళ్యాణ్ రగిలిపోయి తన బౌన్సర్ లతో కొట్టిస్తాడు. అంతే కాకుండా తాను డ్రైవర్ కాదని తన గురించి అసలు నిజాలు బయటపెడతాడు. ఇక కోపం లో కొట్టిన పవన్ ఆ తరవాత ఆలీ కి లక్షల డబ్బు ఉన్న ఒక సూట్ కేస్ ఇస్తాడు. అయితే అప్పటికే ఈ సూట్ కేస్ ను ఎం ఎస్ నారాయణ పవన్ కు తెరచి చూపించాడు. కానీ అలీ మాత్రం అదే సూట్ కేస్ ను తీసుకువెళ్ళి ఓపెన్ అవ్వడంలేదని చెబుతాడు. అసలు ఈ లాజిక్ అలా ఎలా మిస్ అయ్యావు అంటూ నెటిజన్స్ త్రివిక్రమ్‌ని అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…