Roshini : తెలుగు తెరపై సందడి చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న చాలా మంది భామలు ఉన్నారు. వీరిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని వెండితెరకి దూరమయ్యారు. అయితే కొందరు భామలు మాత్రం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆనాటి అందాల తారలు కొందరు ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ తక్కువ సినిమాలకే పరిమితమయ్యారు. వారిలో ఒకరు రాధిక సదనా ఉరఫ్ రోషిణి. ఈ పేరు చెబితే గుర్తుపెట్టుకోవడం కష్టమే, కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా అంటే మాత్రం వెంటనే గుర్తొస్తుంది.
1997లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం శిష్యాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది రోషిణి. ఇక అదే ఏడాది తెలుగులో విడుదలైన మాస్టర్ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. మాస్టర్ పాత్రలో నటించిన చిరంజీవికి ఫ్లాష్ బ్యాక్ లో జోడీగా అలరించింది. ప్రీతీరావు పాత్రలో ఆకట్టుకోవడంతో ఆ తర్వాత పవిత్ర ప్రేమ, శుభలేఖ వంటి సినిమాలలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే రోషిణి నటించిన చిత్రాలేవీ పెద్దగా హిట్ కాకపోవడంతో ఆఫర్లు కూడా తగ్గాయి. రెండేండ్లలో తెలుగుతోపాటు తమిళం, కన్నడలోనూ నటించింది.
రోషిణి హీరోయిన్లు నగ్మా, జ్యోతికల చెల్లెలు కాగా, ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివసిస్తోంది. 25 ఏండ్లు సినిమాలకు దూరమైన రోషిణి ఇప్పుడు కాస్తా లావైపోయారు. గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. ఈక్రమంలో జ్యోతిక ఇటీవల తన సిస్టర్స్ తో దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. అయితే జ్యోతిక ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నప్పటికీ ఆమె సిస్టర్స్ నగ్మా, రోషిణి మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అయితే అక్కా చెల్లెళ్లు కలిసి కట్టుగా దిగిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…