Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. రష్మిక తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని, జస్ట్ ఈ ఐదారేళ్లలో ఆలోవర్ ఇండియా క్రేజ్ సంపాదించడమే కాదు ఓ ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, కూర్గ్, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా వీటన్నింటి పై రియాక్ట్ అయ్యింది రష్మిక. తన గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవాలే అంటూ చెప్పుకొచ్చింది. నాపై వచ్చే రూమర్స్ అన్ని నిజమైతే బాగుండు అని కామెంట్ చేసింది రష్మిక. ఇక నేషనల్ క్రష్‌కు నెటిజన్స్ సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈ ఏడాది రష్మిక వారిసు.. మిషన్ మజ్నూ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది.
వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న ఇటీవల వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. నిజం చెప్పాలంటే పుష్ప వరకు రష్మిక మందన అంటే కొందరికి ఇష్టం. పుష్ప1 తర్వాత బన్నీ అభిమానులు రష్మిక కి కూడా ఫాన్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన .. బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఎవరు ఊహించిన విధంగా డిమాండ్ చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నేషనల్ క్రష్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈ అమ్మడు రానున్న రోజులలో తన క్రేజ్ మరింత పెంచుకుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…