Anushka Shetty : బాహుబలి.. ఈ సినిమా పేరు చెబితే తెలుగు ప్రేక్షకులే కాదు తమిళ ప్రేక్షకులు సైతం మైమరచిపోతుంటారు. తెలుగు, తమిళంతో పాటు పలు భాషలలో రూపొంది మంచి విజయం సాధించి ఎన్నో రికార్డులు సాధించిన బాహుబలి చిత్రంలో అనుష్క.. ప్రభాస్ జోడిగా దేవసేన పాత్రలో కనిపించింది. ఇందులో మరోసారి తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రుద్రమదేవిగా, భాగమతి.. దేవసేనగా తెలుగు సినీ ప్రియుల హృదయాలను దొచుకున్న అనుష్క.. వేద సినిమాలో సరోజ పాత్రలో సైతం అదరగొట్టేసింది. అయితే బాహుబలి సినిమాతో అనుష్కకి మంచి క్రేజ్ దక్కింది. దేవసేన పాత్రలో అనుష్క తన అందంతో పాటు అభినయంతో అదరగొట్టింది.
అయితే చిత్రంలో కథ నచ్చి అనుష్క సినిమాలో భాగం కాలేదు అంటూ తాజాగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయం తెలియజేశారు.ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో అనుష్క రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు చిత్రం మంచి హిట్ కావడంతో ఈ సినిమాతో అనుష్కకి మంచి పేరు వచ్చింది. అయితే బాహుబలి కథ ఏంటి అనే విషయం కూడా తాను వివరించలేదు అసలు రెమ్యూనరేషన్ ఎంత అని కూడా తాను ఏమీ మాట్లాడలేదు కానీ అనుష్క మాత్రం ఈ సినిమాలో భాగమయ్యారు.ఇలా కథ రెమ్యూనరేషన్ ఏవి మాట్లాడకుండా అనుష్క ఈ సినిమాలో నటించడానికి కారణం మరేది లేదు అంటూ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ రానా, రమ, వల్లి కీరవాణి గారు వీళ్లంతా సినిమా చేయగా, ఆ సమయంలో చిత్ర షూటింగ్ ఒక వెకేషన్ లాగ ఉంటుందని వారందరితో గడపడం చాలా సరదాగా ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని తాను ఎందుకు మిస్ చేసుకుంటాను అన్న ఉద్దేశంతోనే అనుష్క ఈ సినిమాలో నటించింది అంటూ రాజమౌళి తెలిపారు. ఏది ఏమైనా ప్రభాస్ అనుష్క ఇలా బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…