Akhanda Movie : నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ మూవీ రికార్డుల వేటను కొనసాగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మరో రికార్డును సొంతం చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీన విడుదలైన ఈ మూవీ ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లన సాధించిన మూవీగా రికార్డులకెక్కింది.
బాలకృష్ణ అఖండ మూవీ మాస్ జాతర ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ కొనసాగుతోంది. విదేశాల్లో ఇప్పటి వరకు ఈ మూవీ ఏకంగా రూ.10.08 కోట్ల గ్రాస్ ను మొదటి వారంలో సాధించింది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. ఈ సందర్బంగా విదేశాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక అఖండ మూవీ అమెరికాలో రూ.6.68 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.1.26 కోట్లు, యూకేలో రూ.72 లక్షలు, యూరప్‌లో రూ.15 లక్షలు, గల్ఫ్ దేశాల్లో రూ.80 లక్షలు, కెనడాలో రూ.25 లక్షలు, సింగపూర్‌లో రూ.13 లక్షలు, మలేసియాలో రూ.4 లక్షలు, సౌతాఫ్రికా, జాంబియా, టాంజానియా, జపాన్‌లలో రూ.5 లక్షల గ్రాస్ వసూళ్లను మొదటి వారంలో రాబట్టింది. ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…