Adivi Sesh : టాలెంటెడ్ హీరో అడివి శేష్ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా మేజర్, హిట్ 2 అనే సినిమాలు చేస్తున్నాడు. హిట్ 2లో అడివి శేష్ కు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ గ్లింప్ల్స్ లో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అడివి శేష్ కు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
మరోవైపు అడివి శేష్.. మేజర్ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఇందులో 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతి ఒక్క ఘటననూ చూపించబోతోన్నారు.
ఈ కుర్ర హీరో ఇటీవలే 36వ పడిలోకి అడుగు పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఎప్పటినుంచో పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నేనే ఎదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా అన్నారు. అలాగే కొన్నాళ్లు గట్టిగా చెప్పారు .. ఆ తరువాత తిట్టారు .. ఇక వీడికి చెప్పడం వేస్ట్ అని వదిలేశారు. కానీ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే నాకు పెళ్లిపై గాలి మళ్లింది అన్నారు శేష్. వచ్చే ఏడాది అడవి శేష్ పెళ్లి అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…