Pradhuman Singh Tomar Cleaned Toilets in Government School : ప్రజలు వేసిన ఓట్లతో ప్రజా ప్రతినిధులుగా గెలిచే నేతలు తిరిగి ప్రజల ముఖం చూడరు. వారి సమస్యలను పట్టించుకోరు. చాలా మంది ప్రజా ప్రతినిధుల వ్యవహారం ఇలాగే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిజమైన నాయకులమని నిరూపిస్తున్నారు. తాము ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం వెనుకాడడం లేదు. ఆ మధ్యప్రదేశ్ మంత్రి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారని చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ తాజాగా అక్కడి గ్వాలియర్‌లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ కొందరు బాలికలు పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తోమర్ స్వయంగా రంగంలోకి దిగి ఆ పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రం చేశారు.
అయితే ఆయన ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఆయన ఇలాగే టాయిలెట్లను శుభ్రపరిచారు. ఈ క్రమంలోనే తోమర్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలని అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…