12th Fail Movie OTT Release : ఓటీటీలో ఇటీవల వచ్చే చాలా సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో ఆదరిస్తున్నాయి. ఇప్పుడు 12th ఫెయిల్ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. పట్టుదలతో చదవి చివరకు కాపీ కొట్టకుండానే పాసైన ఆ స్టూడెంట్.. ఎలా ఐపీఎస్ అయ్యాడన్న స్టోరీని వావ్ అనేలా ప్రజెంట్ చేశారు. ప్రేరణాత్మక రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఆస్కార్స్‌కు ఇండిపెండెంట్ నామినేషన్ కింద వెళ్లింది. ఆస్కార్స్‌కు నామినేషన్ వేసిన విషయాన్ని ఆ ఫిల్మ్ హీరో విక్రాంత్ మాసే తెలిపారు. ప్రేరణాత్మక రీతిలో సాగిన 12th ఫెయిల్ 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిగా, ఈ చిత్రం 70 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. విక్రాంత్ మాసే ఈ ఫిల్మ్‌లో కీలక పాత్ర పోషించాడు. టీవీ రంగంలో విక్రాంత్ కెరీర్ ప్రారంభమైంది. అతను డ్యాన్సర్ కూడా.
థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. జీ5 ఓటీటీ రైట్స్ సొంతం చేసుకోగా, జనవరి 5 న 12 ఫెయిల్ మూవీ జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో విక్రాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి. విద్యావ్యవస్థలోని లోతుపాతులతో పాటు సివిల్స్ కోసం సన్నద్దమయ్యే పేద విద్యార్థుల జీవితాలను 12th ఫెయిల్ సినిమా లో మనసుల్ని కదలించేలా ఆవిష్కరించారు. ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజైంది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేయడం సర్వసాధారణం.

అలానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 12త్ ఫెయిల్ తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేశారు. 12త్ ఫెయిల్ అనే సినిమాను ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోష్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అదే పేరుతో అనురాగ్ పాఠక్ రాసిన బెస్ట్ సెల్లర్ పుస్తకం ఆధారంగా తీశారు. కథకి అనుగుణంగా సినిమాను బాగా తెరకెక్కించారు మేకర్స్. ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సే తన పాత్రలో జీవించాడు. మేధా శంకర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. 12th ఫెయిల్‌లో చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగడం, కొన్ని చోట్ల ముందుగా ఏం జరుగుతుంది అనేది ఊహించే విధంగా ఉంటుంది.