నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలోనే ఇందులో ఖాళీగా ఉన్నటువంటి 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ఈ ఉద్యోగానికి ఆగస్టు 12 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 3 చివరి తేదీ.ఈ ఖాళీ లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ సంప్రదించాలి. https://www.unionbankofindia.co.in/పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి.ఆ వివరాలను ఈ వెబ్ సైట్ ఆధారంగా అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 40 సంవత్సరాలు వయసు మించి ఉండకూడదు. మేనేజర్ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు ఇతరులు 850 రూపాయలు చెల్లించాలి. సెప్టెంబర్ 3 2021 దరఖాస్తుకు చివరి తేదీ.