తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఖాళీగా ఉన్న 151 ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామ మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇవి మల్టీ జోన్ ఉద్యోగాలు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ లో విడుదల చేసిన 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలలో మల్టీ జోన్-1 లో 68 పోస్టులు ఖాళీగా ఉండగా.. మల్టీ జోన్ -2 లో 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అదే విధంగా ఇంటర్ తర్వాత ఐదు సంవత్సరాల లా కోర్సు ఉత్తీర్ణత అయిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. అలాగే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు జులై 4, 2021 నాటికి రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
2021 july 4 వ తేదీకి అభ్యర్థుల వయస్సు 34 సంవత్సరాలలోపు వారే ఉండాలి. పరీక్షలు రాసే వారికి మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.మొదటి పేపర్‌లో 200 ప్రశ్నలు ఉండగా. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు కేటాయించారు. రెండవ పేపర్ 100 మార్కులకు గాను డిస్క్రిప్షన్ రూపంలో ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ https://www.tslprb.in/