నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) పలు విభాగాల్లో మొత్తం 42 ఖాళీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. అందుకు గాను nhai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసేందుకు ఏప్రిల్ 12ను చివరి తేదీగా నిర్ణయించారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితర పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.
ఎన్‌హెచ్ఏఐ రిక్రూట్‌మెంట్ 2021
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) – 6 ఖాళీలు
- మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) – 24 ఖాళీలు
- డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) – 12 ఖాళీలు
అర్హతలు
డిప్యూటీ జనరల్ మేనేజర్ – కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ లేదా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్స్)లో మాస్టర్స్ చేసి ఉండాలి. లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అకౌంట్స్ సంబంధిత సేవల్లో 6 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లెవల్ 12 వేతనం లభిస్తుంది. రూ.78,800 నుంచి రూ.2,09,200 జీతం ఇస్తారు.
మేనేజర్ – కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ లేదా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్స్)లో మాస్టర్స్ చేసి ఉండాలి. లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అకౌంట్స్ సంబంధిత సేవల్లో 4 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లెవల్ 11 స్థాయి వేతనం లభిస్తుంది. రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు వేతనం ఇస్తారు.
డిప్యూటీ మేనేజర్ – కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ లేదా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్స్)లో మాస్టర్స్ చేసి ఉండాలి. లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అకౌంట్స్ సంబంధిత సేవల్లో 4 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లెవల్ 10 స్థాయి వేతనం ఇస్తారు. రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం ఇస్తారు.
nhai.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అభ్యర్థులు పైన తెలిపిన పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6 గంటల లోగా పంపించాల్సి ఉంటుంది. GM (HR &Admn.)-I A, National Highways Authority of India, Plot No: G – 5&6, Sector – 10, Dwarka, New Delhi – 110075 అనే అడ్రస్‌కు చేరేలా దరఖాస్తులను పంపించాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.