Yama Dharma Raju : మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది..? అతని శరీరాన్నయితే ఖననం చేస్తారు. మరి ఆత్మ సంగతి..? అది ఎక్కడికి వెళ్తుంది..? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది..? మీకు తెలుసా..? ఆ.. అయినా ఈ రోజుల్లో ఆత్మలు, ప్రేతాత్మలు ఏంటి అంటారా..? అలా అనుకునే వారు ఉంటే ఉంటారనుకోండి. వారి సంగతి పక్కన పెడితే అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి..? మనిషి మరణించాక అతని ఆత్మకు ఏమవుతుంది..? యమధర్మ రాజు దగ్గరికి ఎలా వెళ్తారు..? తదితర విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి మరణానంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించబడింది. మరికొద్ది సెకన్లలో చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట. తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వస్తుందట. దీంతో అతను ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకుంటాడట. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడట. అయితే ఆ సమయంలోనే మనిషి యమదూతలను చూస్తాడట. వారు అత్యంత వికారంగా, నల్లగా, తల అనేది ఒక సరైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా వారు కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మల విసర్జన చేస్తాడట. అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట. దీంతో ఆ ప్రాణాన్ని (ఆత్మను) యమదూతలు నరకానికి తీసుకువెళ్తారట.
యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల సమయం పడుతుందట. ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారట. తమను చూసి భయపడినా, ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో చితక్కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట. దీంతోపాటు నరకంలో విధించే శిక్షలను గురించి యమదూతలు ఆత్మలకు కథలు కథలుగా చెబుతారట. దీంతో ఆత్మలు ఏడుస్తాయట. తమను అక్కడికి తీసుకువెళ్లవద్దని ప్రార్థిస్తాయట. అయినా యమదూతలు కనికరించరు సరి కదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మ రాజు ముందు ప్రవేశపెడతారట.
నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాప, పుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తాడట. చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాప పడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మ రాజు చూడడట. కానీ దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట. అబద్దాన్ని కూడా పాపం గానే పరిగణిస్తారట. అయితే పాప, పుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోసారి భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తాడట.
ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కర్మకాండలు, పిండ ప్రదానాలు అన్నీ చేయాల్సి ఉంటుందట. ఇవన్నీ మనిషి చనిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాలట. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతుందట. ఈ కథంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, గరుడ పురాణంలో దీన్ని చెప్పారు. అది చదివితే ఇంకా మరిన్ని విషయాలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…