ఆధ్యాత్మికం

Bali Temple : ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు..! ఎలా వెళ్లాలో తెలుసా..?

Bali Temple : ఇండోనేషియా స‌మీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్ర‌మే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవ‌న్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవుల‌న్నీ హిందూ మ‌హాస‌ముద్రం ప‌రిధిలోకి వ‌స్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవ‌రించి ఉన్న స‌ముద్రాన్ని మాత్రం జావా స‌ముద్ర‌మ‌ని పిలుస్తారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ఈ బాలి దేశంలో మ‌హాస‌ముద్రంలో ఉండే ఓ చిన్న‌పాటి కొండ‌పై ఓ హిందూ దేవాల‌యం ఉంది. ఇది చాలా ఏళ్ల కింద‌టి నాటిద‌ని చెబుతారు. ఈ దేవాల‌యం ప్ర‌త్యేక‌త ఏమిటంటే..

బాలిలోని త‌బ‌నాన్ అనే ప్రాంతంలో మ‌హాస‌ముద్రంలో కొండ‌పై ఉన్న ఆల‌యాన్ని త‌నాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది హిందూ దేవాల‌యం. ఇక్క‌డ స‌ముద్రం, భూమి రెండూ క‌ల‌సి దైవంగా ఏర్ప‌డ్డాయ‌ని న‌మ్ముతారు. ఈ ఆల‌యం చుట్టూ మ‌హాస‌ముద్రం ఉండ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున అలలు వ‌స్తుంటాయి. ఒక‌సారి అల వ‌స్తే ఆల‌యం మెట్ల‌న్నీ అందులో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆ మెట్లు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఆ స‌మ‌యంలోనే ఆ ఆల‌యంలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అల వ‌చ్చిన‌ప్పుడు మెట్ల‌పైనే ఉంటే ఆ అల‌తోపాటే స‌ముద్రంలోకి వెళ్తారు.

Bali Temple

ఇక ఈ ఆల‌యం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవుల‌ను ప‌ర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్క‌డికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. కాగా ఈ ఆల‌యం కింది భాగంలో అత్యంత పురాత‌న వ‌స్తువులు ఎంతో విలువైన‌వి ఉన్నాయ‌ట‌. కానీ వాటికి కంటికి క‌నిపించ‌ని విష స‌ర్పాలు కాప‌లాగా ఉంటాయ‌ట‌. ఎవరైనా ఆ వ‌స్తువుల‌ను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయ‌ని ఇక్క‌డి స్థానికులు చెబుతారు. ఇక ఈ ఆల‌యంలో ఉండే మ‌రో విశేష‌మేమిటంటే.. ఈ ఆల‌యం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆల‌యంగా చెక్కారు.

దీంతో ఆల‌య ప‌రిస‌రాలు చాలా ప్ర‌కృతి మ‌నోహ‌రంగా ఉంటాయి. ఇక ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌లో సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యాల‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వంటే న‌మ్మండి. అంత‌టి సుంద‌రంగా ఈ ఆల‌య ప‌రిస‌రాలు దర్శ‌న‌మిస్తాయి. అయితే ఈ ఆల‌యానికి వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంద‌ట‌. ఎందుకంటే ఇక్క‌డ ప్రాణాపాయ ప‌రిస్థితులు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి.. ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఆ మాత్రం ఎక్కువ డ‌బ్బును పర్యాట‌కుల నుంచి వ‌సూలు చేస్తారు లెండి. ఏది ఏమైనా ఈ ఆల‌య విశిష్ట‌త‌లు భ‌లే ఆశ్చ‌ర్యంగా ఉన్నాయి క‌దూ.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM