Lift Button Dots : నిత్యం మనం దైనందిన జీవితంలో ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తుంటాం. వాడుతుంటాం. అయితే ఏ వస్తువును వాడినా దాన్ని మనం అంతగా పరిశీలించం. కానీ.. దాన్ని పరిశీలిస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మరి అలాంటి పరిశీలించదగిన వస్తువుల్లో లిఫ్ట్ కూడా ఉంది తెలుసా..? అవును, మీరు విన్నది కరెక్టే. సరే గానీ ఇంతకీ లిఫ్ట్ గురించి అలా పరిశీలించాల్సిన, దాని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి..? అంటారా..! అయితే అదేమిటో కింద చదివి తెలుసుకోండి..!
ఏమీ లేదండీ.. లిఫ్ట్‌లో బటన్లను మీరు చూశారు కదా. మనల్ని ఏ ఫ్లోర్‌కు కావాలంటే ఆ ఫ్లోర్‌కు అవి తీసుకెళ్తాయి. అందుకు సింపుల్‌గా ఆ ఫ్లోర్‌కు చెందిన బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు. దాంతో మనకు కావల్సిన అంతస్తుకు ఎంచక్కా వెళ్లవచ్చు. అయితే లిఫ్ట్‌లో ఉండే ఆ ఫ్లోర్ బటన్స్ కిందే చిన్నపాటి చుక్కలు ఉబ్బెత్తుగా ఉంటాయి. చేతి వేళ్లతో తడిమితే మనకు అవి తెలుస్తాయి. పైకి కూడా అవి కనబడతాయి. మరి ఆ బటన్స్ కింద ఆ చుక్కలు ఎందుకు ఉంటాయో తెలుసా..?
మనమంటే కళ్లతో చూసి బటన్‌ను నొక్కి లిఫ్ట్ ద్వారా కావల్సిన ఫ్లోర్‌కు చేరుకుంటాం. కానీ అంధులు అలా కాదుగా..! వారికి లిఫ్ట్ బటన్లు కనిపించవు కదా. మరి వారు అప్పుడు ఎలా ఆ బటన్లను నొక్కుతారు..? అందుకే వారు కూడా సులభంగా ఆయా బటన్లను నొక్కేందుకు వీలుగా ఆ డాట్స్ (చుక్కలు) ఏర్పాటు చేస్తారు. మరి వాటిని అంధులు ఎలా గుర్తిస్తారంటే..? అందుకు బ్రెయిలి లిపి ఉపయోగపడుతుంది. అవును, అదే. ఆ చుక్కలను బ్రెయిలి లిపిలో ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో బ్రెయిలి లిపి వచ్చిన అంధులకు ఆ చుక్కల గురించి సులభంగా తెలిసి పోతుంది. అప్పుడు వారు లిఫ్ట్ బటన్లను కరెక్ట్‌గా ప్రెస్ చేస్తారు. అదీ.. లిఫ్ట్‌లో బటన్ల కింద ఉండే చుక్కలకు చెందిన అసలు విషయం..!
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…